భీష్మ ఏకాదశి ‘ అని ఎందుకంటారు ?

మాఘ శుక్ల ఏకాదశినే ” భీష్మ ఏకాదశి ” అంటాము. భీష్ముడు ఆజన్మ బ్రహ్మ చారి, అష్ట వసువులలో ఒకడు, మహాభారతానికి ఆది పురుషుడు, ధర్మ శాస్త్రాలు తెలిసిన మహాజ్ఞ్యాని, త్యాగశీలి, బుద్ధిశాలి, ధీరోదాత్తుడు, గొప్ప యోధుడు, అతి పుణ్యాత్ముడు. కొంత మంది భీష్ముడు ఈ రోజునే మరణం పొందాడు అనుకుంటారు, కానీ నిజానికి భీష్ముడు నిర్యాణం చెందింది అష్టమి రోజున, ఆ రోజునే ‘ భీష్మాష్టమి ‘ అంటామని ఇది వరకే చెప్పుకున్నాం.
మరి ‘ భీష్మ ఏకాదశి ‘ అని ఎందుకంటారు ? అన్న సందేహం కూడా చాలా మందికి వస్తుంది.

భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. తన తండ్రికి సత్యవతి అనే కన్యకు వివాహం జరిపి ఆమె పుత్రుడే రాజ్యానికి రాజు కావాలన్న తండ్రి అభీష్టము గ్రహించి ‘ నిశ్చయాత్మక బుద్ధితో నేను చేసే సత్య ప్రతిజ్ఞ్యను ఆలకించండి, ఇంతకు పూర్వం కానీ ఇక ముందు కానీ ఇలాంటి ప్రతిజ్ఞ్యను ఎవరు చేయలేదు చేయరు. ఇప్పటి వరకు రాజ్యంపైన నాకుండే అధికారమును మాత్రమె కాదు రాజస్త్రీ భోగాలను, సంతాన వాంచను కూడా వదిలేస్తున్నాను, ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను ” అని కఠోర ప్రతిజ్ఞ్య చేశాడు. దాన్నే ‘ భీష్మ ప్రతిజ్ఞ్య ‘ అంటారు.
తండ్రి శంతనుడు మెచ్చి ‘ ఇచ్చా మరణ వరం ప్రసాదిస్తాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు నేలకొరిగి ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు శరీరం లో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు. చివరికి ఈ రోజు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ధర్మరాజుకు ఉపదేశించాడు .

శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత –భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.

కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం?
స్తువంత: కం కమర్చంత: ప్రాప్నుయుర్మానవా శుభం?
కో ధర్మ సర్వ ధర్మానాం భవత: పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?

లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.

దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,

అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.

ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ

ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన, మహా తపస్వి, పరమ పూజ్య నందానంద స్వామి ఒక రోజు దీనిని నాకు వివరిస్తూ, సత్యా, పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః- ఏది పరమమైన తెజమో, ఏది పరమ మైన తపమో అట్టి దివ్యము తేజోమయము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అన్నారు.భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం. అలా ఆనందించిన పరమాత్ముడు తనకిష్టమైన ఈ ఏకాదశికి ‘ భీష్మ ఏకాదశి ‘ అని నామకరణం చేస్తున్నాను, తద్వారా నీ ఖ్యాతి జగద్విదితం అవుతుంది, ఎవరైతే నీచే శ్రుతమైన ఈ ‘విష్ణు సహస్ర నామం’ ప్రతినిత్యం పారాయణం చేస్తారో వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అని ఆశీర్వదించాడు.

కనుక ప్రతి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలా చేయని పక్షంలో కనీసం ఈ రోజైనా విష్ణు సహస్రనామం పాtరాయణం చేద్దాం, ఆ భీష్ముని ఋణం తీర్చుకుందాం,

ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్త పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం. పరమాత్ముని అనుగ్రహం పొందుదాం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s