హిరణ్యాక్ష,హిరణ్యకశివుల జననం

దక్షునికి పదముగ్గురు కుమార్తెలు. వారందరూ బ్రహ్మర్షి కశ్యపుని పెండ్లి చేసుకుంటామంటే, సరే అలాగే అని తండ్రి వారిని కశ్యపునుకి యిచ్చి పెళ్ళి చేసాడు. ఒక సాయంకాల వేళ దితి , తపస్సులో ఉన్న పతి దగ్గరకు సంతానం కావాలన్న కోరికతో వెళ్ళింది.

అప్పుడు కశ్యపుడు ఆమెను ప్రేమతో చూసి, “తప్పకుండా అలాగే. కాని కొంచెం సేపు ఆగు. ఈ సమయాన్న రుద్రుడు జగత్తునంతా కాచుతున్నాడు. అతని కంటపడుతున్న సమయంలో మనం సంగమించుకోకూడదు”. అని చెప్పాడు. ఆమె మన్మధ వేధ భరించలేక ఆగనన్నది. అందుకని మరి ఆగకుండా దితితో సంగమించి తిరిగి తపస్సుకు వెళ్ళిపోయాడు.

తను చేసిన తప్పుకి నొచ్చుకుని దితి, “నా బిడ్డకేమీ అనర్ధమవదు కదా” అని భయపడుతూ, వెళ్ళి పతితో తన సంశయం చెప్పుకుంది. అప్పుడు కశ్యపుడు, “అయిపోయాకా యిప్పుడు చింతించుతే ప్రయోజనమేమిటి?” అని దివ్య దృష్టితో చూసి, “నీకు కవలపిల్లలు పుడతారు. ముల్లోకాలనీ జయించే వారలవుతారు. కాని దయలేని మానవులని చంపుతూ, పతివ్రతలని బలాత్కరించుతూ, మునీంద్రులని యేడిపిస్తూ, భూభారమవుతారు. ఒక్కటే సుగుణం కనబడుతోంది. ఇద్దరూ నారాయణుని చేతిలో చచ్చి, వైకుంఠయోగం పొందుతారు. నీ మనమడు హరిభక్తుడిగా ఆచంద్రార్కమైన యశస్సు గల వాడవుతాడు” అని భార్యను సముదాయపరిచాడు.

హిరణ్యాక్ష,హిరణ్యకశివులు తల్లి గర్భంలో ఉండగానే వారి తేజస్సు సూర్యుని కప్పివేసింది. సూర్యుడు లేకపోతే యెలా అని దేవతలు వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. వారికి బ్రహ్మ , “భయపడకండి. పూర్వం సనక సనందులు మరో యిద్దరి మునులతో వైకుంఠం వెళ్లినప్పుడు వారు అక్కడ ద్వారపాలకులైన జయవిజయుల కిచ్చిన శాపఫలితంగా దితి గర్భాన్న అవతరించబోతున్నారు. వారి తేజస్సే యిది. వారిని సంహరించడానికి శ్రీహరి అవతారపురుషుడై ఉద్భవిస్తాడు. ఆ సమయం కోసం వేచియుండండి” అని చెప్పి పంపించాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s