కుటుంబ భందవ్యాలు మోక్షానికి ప్రధానమైన ద్వారాలు

 • అన్ని ధర్మలొకి గృహస్థ ఆశ్రమ ధర్మం గొప్పది ఎందుకంటే గృహస్తునిగా మరి తన ధర్మాలను నెరవేర్చిన వారికే మోక్షము త్వరగా లభించగలదు అని రుషి వాక్కు
 • గృహస్థ ఆశ్రమధర్మం వివాహంతో మొదలు అవుతుంది
 • విద్యాభ్యాసం పూర్తి చేసిన వరుడికి తగిన వధువు చూసి వివాహం చేస్తారు వరుని తండ్రి ఇది పితృ ధర్మం
 • జన్మను ఇచ్చిన తల్లి తండ్రులు చూపిన అమ్మాయిని వివాహం చేసుకొనుట పుత్ర ధర్మం
 • కూతురికి తగిన అబ్బాయిని ఎంచి కన్యాదానం చేయుట మరియు ఆమె మనస్సు ఇష్టపడిన వారిని ఎంచుకోమని స్వయం వరం ప్రకటించుట పుత్రిక తండ్రియొక్క ధర్మం
 • వివాహం చేసుకున్న భార్యను పోషించుట భర్తయొక్క ధర్మం
 • వివాహానంతరం మెట్టిన ఇల్లుని పుట్టిన ఇల్లుగా భావించి అత్తమామలను తల్లితండ్రులుగా సేవించటము కోడలిగా అడుగు పెట్టిన స్త్రీకి ప్రధాన ధర్మం
 • సంపాదన కోసం బయట కష్టపడి వచ్చిన భర్తకు చిరు నవ్వుతో ఎదురు వచ్చి తల్లిలా లాలించి సేద తిర్చటము అర్ధాంగిని ధర్మం
 • తను మూడు ముళ్ళు వేసి తన ఇంటికి భార్యగా తెచ్చుకున్న స్త్రీని బోగా వస్తువుగా చూడకూడదు ఎందుకంటే తన వంశాన్ని నిలపెట్టడానికి వచ్చిన దేవతను గౌరమర్యాదలతో చూడాలి అప్పుడు ఆ ఇల్లు లక్ష్మి నివాసం అవుతుంది ఇది పురుష ధర్మం
 • కోడలిగా వచ్చిన స్త్రీని అత్తమామలు గోమాతను చూసినట్టు చూడాలి ఎందుకంటే ఒక బలుపు తాడు వేసి గొడ్ల చావడిలో కట్టిన అవునని మనం లక్ష్మి స్వరూపంగా చూస్తాం ఎందుకంటే గడ్డి తిని పాలు మనకు ఇస్తుంది కబ్బటి ఆ పాలను మనం పెరుగుగా, వెన్నగా,నేయిగా మార్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటాము కబ్బటి అలానే ఒక పసుపుతాడుని నమ్మి తన ఇల్లు వదిలి ఊరు వదిలి భర్తను అత్తమామలను తన వాళ్ళుగా భావించి తన సర్వం అర్పించి వంశాంకురాన్ని తన రక్త మాంసాలతో ఇస్తుంది స్త్రీ.
 • భర్త పిల్లలు అత్తరిల్లు తప్ప వేరు ఎరుగని ఇల్లాలిని హింసించే మాటలను అనటం “గో” హత్యతో సమానం.
 • ఆమెకు మీరు ఎంత గౌరవ ప్రేమాభిమానాలు ఇస్తారో అంత లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ సకల దేవతలా ఆశీర్వాదం ఉంటుందని వేదాలు చెప్తున్నాయి ఇది ప్రధానమైన ధర్మం
 • దిని ఆచరించటం మహా కష్టం ఎందుకంటే కొత్తగా జీవితంలో వచ్చిన వారిని ప్రేమించి ఆదరించటం అంత సులువు కాదు కాని ప్రయత్నించాలి ఆమె త్యాగం గుర్తించాలి అప్పుడే వారి ఇల్లు లక్ష్మి గౌరిలకు స్థిర నివాసం అవుతుంది.
 • కావున పైన చెప్పిన ధర్మాలను అనుసరించి దైవం చేత ప్రశంసలు అందుకోనటమే మనిషిగా పుట్టిన వారికి ప్రధానమైన ధర్మం
 • గృహస్థ ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తే ఏ తప్పసులు చేయవలసిన అవసరం లేదు
Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s