వైకుంఠ ఏకాదశి

పద్మపురాణం ప్రకారం… కృతయుగంలో చంద్రావతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు… భ్రహ్మదేవుడి వరగర్వంతో యజ్ఞ యాగాదులన్నిటినీ ధ్వంసం చేయటమే కాక స్వర్గం పై కూడా దండెత్తి వారినీ హడాలెక్కించాడు… ముల్లోకలంతా శ్రీహరిని శరణు వేడుతారు… వెంటనే ఆశ్రిత రక్షకుడు మురాసురిదిపై యుద్ధానికి బయలుదేరాడు… బ్రహ్మదేవుని వరప్రభావామో… ఇంకేమో ఎంతకీ ఆ రాక్షసుడు లొంగలేదు…. అలసి సొలసిన విష్ణువు బదరికాశ్రమంలో సేదదీరుతాడు.. ఆ సమయంలో అతని శరీరం నుండి ఒక ఏకాదశి అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది.. శ్రీ హరి ఆ కన్యామని ధైర్యానికి మెచుకుని ఏదయినా వరం కోరుకోమంటాడు… తన పేరయిన ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించిన వారికి ముక్తిని ప్రసాదించే వరమీయమని వేడుకుంటుంది.. తదాస్తు అని వరమిస్తాడు…
గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం , కాశీని మించిన క్షేత్రం, ఏకాదశిని మించిన ఉత్తమ వ్రతం లేదు…

ఉపవాసం అంటే…. కేవలం ఆహారాన్ని తినకుండా ఉండడం అని మాత్రమే కాదు… ఆరోజు మొత్తం శ్రీహరితో మనం మమేకం అనగా అతనితో చేసే వాసం అని అర్ధం…
ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు.. ఎందుకంటే ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీహరి సాక్షాత్కరిస్తాడు… అందుకే అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా శ్రీహరి దర్శనమిస్తారు… ఈ రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠమునకు చేరుకున్నట్లే… వైకుంఠ0 అంటే వెలుగు, కాంతి అని అర్ధం … ఆలోచనలను సంస్కరించుకుంటూ… అజ్ఞానమనే చీకటినుండి…ఆధ్యత్మికమనే వెలుతురు వైపునకు పయనింప చేసేదే ముక్కోటి / వైకుంఠ ఏకాదశి…

ఓం సహస్ర శీర్షం దేవం…
విశ్వాక్షం విశ్వ శంభువం….
విశ్వం నారాయణం….
దేవమక్షరం పరమం పదం….

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s