మానవ జన్మ విలువ తెలియక కాలం గడపటం పుశువు కంటే హీనం

భజ యతిరాజమ్ భజ యతిరాజమ్ |
భజ యతిరాజమ్ భవభీరో ||

నిశి వనితా సుఖ నిద్రాలోలః
ప్రాతః పరదూషణపటుశీలః |
అంతమ్ యాతి నిజాయుః కాలః
కిమ్ జానాతి నరః పశులీలః || ||భజ|| (5)

మనిషికి ఆయివు ఎంతకాలం ఉంటుంది ? వంద ఏండ్లు బ్రతకాలని కోరుకుంటారు. వంద ఏండ్లు బ్రతకమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. వేదం “శతమానం భవతి” అని అశీర్వదిస్తుంది. నూరేల్లు అనేవి ఎంతకాలం అనేది మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో కాలం. అందరికీ నూరే కావాలని నియమం లేదు, కొంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. నూరు అనేది భగవంతుడు ఏర్పరిచినదే నూరేల్లు, ఎంత యితే అంత. కొందరు భాధ్యతలన్నీ పూర్తిచేసుకొన్నాక భగవంతుడి నామాన్ని తీసుకుంటాం అని అంటుంటారు. ఎవరి ఆయువు ఎంత ? అంత వరకు బ్రతుకుతాడని నియమం ఏమీ లేదు. అయువు కాలం ఎంత అంటే చెప్పలేం. చేయాల్సిన పని ఆ కాలం వచ్చేలోపు ఈ శరీరం వచ్చినందుకు మనం చేయాల్సింది ఆచార్య శ్రీచరణ నామ సంకీర్థనం, ఆచార్యుడు చూపిన భగవంతుని పాద ఆశ్రయణం. ఇవి చేసి వారు అందించే ఆధ్యాత్మిక శక్తితో బ్రతకడం అనేది మనం చేయాల్సింది. అలా చేయలేక పోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. కేన అనే ఉపనిషత్తు చెబుతుంది, ఈ శరీరంఉంటుండగా తెలుసుకోక పోతే నీవు అతి విలువైనది పోగొట్టుకున్నట్లే. “ఇహ చేద వేదీత్ అద సత్య మస్తీత్ న చేర్యః వేదీత్ మహితీ వినష్టిః”. అంతకంటే గొప్ప నష్టం అనేది లేనే లేదు. మానవ శరీరం దొరకడం అనేది అంత సులభంగా రాదు. వచ్చింది అంటే ఎన్ని రకాల సుకృతాలు చేసుకున్నామో, వాటి ఫలితంగా వచ్చింది. వచ్చేసింది కనుక తెలియటం లేదు. సంపన్నుల గృహంలో పుట్టినవాడికి సంపధ విలువ అంతగా తెలియదు, సంపధ లేని వారికి ఆ విలువ ఏమిటో తెలుస్తుంది. చందన వనాల్లో ఉండే బిల్ల స్త్రీ తనం నిత్యం చందనపు కట్టెలతో వంట చేసుకుంటుందట, వారికి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని అంత దృష్టి ఉండదు. అట్లానే మనకి మానవ శరీరం వచ్చేసింది మనం కోరుకుంటే రాలే, అది వచ్చే సరికి మనకు దాని విలువ తెలియడం లేదు. చేసుకోవాల్సిన పనులు మర్చిపోతున్నాం. శరీరానికి కావల్సిన వన్నీ ఇవ్వాలి, అది తప్పదు. కానీ దానితో పాటు మనం భగవంతునికి శరణాగతి చేయడం అనేది మనిషిగా మనం చేయాల్సింది. శరీరంలో ఆత్మ అనేది ఉంది అని జంతువులు గుర్తించలేవు, మనం గుర్తించగలం. అదే తేడా మనకీ జంతువులకీ. శరీరం విషయంలో అవే చాలా సరిగ్గా ఉంటాయి మనకంటే. మన గురించి మనం ఆలోచించుకొనే అవకాశం మనకు మాత్రమే ఉంది. ఇది గుర్తించి బ్రతకమని చెబుతారు.

పగలు రాత్రి దేవుడెందుకు ఇచ్చాడు ? పగలు శ్రమించి పనిచేయి, రాత్రి విశ్రాంతి తీసుకో. జంతువులు తెలతెల వారేప్పటికీ లేస్తాయి, సూర్యాస్తమయానికి పడుకుంటాయి. అదే మనుషులు సమయాన్ని రకరకాలుగా వాడుకుంటారు. విశ్రాంతికి ఇచ్చిన సమయాన్ని విశ్రాంతికి వాడుకోరు, శ్రమించాల్సిన సమయాన్ని శ్రమకు వాడుకోరు. వారిని వారే అధోగతి చేసుకోవడానికి అస్తవ్యస్తంగా లేదా, విరుధ్ధంగా వాడుతుంటారు. “నిశి వనితా సుఖ నిద్రాలోలః” రాత్రిని నిశా అంటారు, పగటిని దివా లేదా ప్రాతః అంటారు. రాత్రి పగలు గడుస్తుంటాయి, ఆయువు నాశనం కావడానికి మన చుట్టూ ప్రకృతిలో ఏవో ఒకటి ఉండనే ఉంటాయి. కానీ వాటిని మనం అయువు నాశనం కోసం కాక అయువు మర్దకంగా వాడుకో గలగాలి. నీటి ప్రవాహం ఎక్కువైతే మనుషులు కొట్టుకు పోతారు, కానీ నీటి ప్రవాహం అనేది చెడ్డదా ? కట్టలు కట్టి దాన్ని వాడుకొనే రీతిలో వాడుకుంటే ఎందరికో ఆహారాన్ని ఇస్తుంది. ప్రాణం ఇచ్చేది అదే, సరిగా వాడుకోకపోతే ప్రాణం తీసేదీ అదే.

ఇప్పుడు ఎక్కడ చూసినా పోటీ ప్రపంచం, కానీ పొందు కోరే ప్రపంచం అవ్వాలి. పోటీతో పోరు కూడా వస్తుంది. మనకు కావల్సింది సహకారం కానీ స్పర్థ కాదు. కానీ చిన్న పిల్లలలో మొదలుకొని పోటీని పెంచుతున్నాం. పిల్లలు, మనుషులని కాదు దేశాలే అట్లా వున్నాయి ఈ నాడు. దేశాలు కూడా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం రకరకాల దోరణిలు కనిపిస్తున్నాయి. అధిపత్యపు పోరుకు కారణం తనకంటే మరొకడు ఎదగకూడదని. అది ఏర్పడితే ఎదుటివాణ్ణి దూషించడం అనేది మొదలవుతుంది. “ప్రాతః పరదూషణ” ఉదయం లేవగానే ప్రదూషణ, “పటు” అందులో ఒక పటుత్వం, అది ఒక్క రోజు కాదు, “శీలః” అదే వాడి గుణం.

“అంతమ్ యాతి నిజాయుః కాలః” అట్లా అయువు కాలం అంతా వృదా, “కిమ్ జానాతి నరః పశులీలః” ఇక పశువు జీవనమే కదా మనిషిది. భగవంతుడు పనిచేయడానికి ఇచ్చిన రంగంలో నిరంతరం స్పర్థ నిరంతరాం ఈర్ష్య అసూయలు, అవి పడకపోతే పరదూషణ. రేపు చేద్దాం అని అనుకున్న మంచిపని కాస్త ఇక్కడికే ఆగిపోతుంది. జంతువుల జీవనం కంటే వ్యర్థం అవుతుంది మనిషి జీవనం. ఇది తగదు, ఆచార్యుల ఆశ్రయణ చేయాలి, భగవంతుణ్ణి గుర్తించగలగాలి, ఆ భగవంతుని సేవగా గుర్తించి జీవనం గడపాలి. ఇది అవసరం సుమా!

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s