రామా

రామా ! మ్రొక్కులు నీదు నామమునకున్, రమ్యాంఘ్రి పద్మాలకున్
శ్రీమన్మంజులమైన మేనికి, ధనుర్లీలాకళాకేళికిన్,
నీ మర్యాదకు, ధర్మనిష్టకు, రసోద్వేలమ్ము నీ గాథకున్,
ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ ! రామచన్ద్ర ప్రభూ !

399988_501196826589766_1288854569_n
(రాముని నామానికి, రమ్యమైన చరణాలకీ, శ్రీమంతమైన మేనికి, ధనుర్విద్యకు, మర్యాదకీ, ధర్మనిష్ఠకీ, రసవంతమైన రామకథకీ, రామ పరివారానికీ ప్రేమ మీరగా మ్రొక్కులు. “రామ” లో ఇన్ని వందనీయాంశాలున్నాయి. మొత్తం రామాయణమంతా ఇందులోనే ఉంది.)
ఈ అందమైన రమ్యమైన పద్యం గురువుగారు..బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి “రామచన్ద్రప్రభూ” శతకంలోనిది.. వారే సంభావించినట్టు ఇది వారు తనకోసం వ్రాసుకున్న చిన్నపాటి రామాయణం..
గురువుగారి మాటల్లో అసలు ఈ నాడు – కాదు – ఏనాడైనా, రాముడు మన ముందుండాలి. సమగ్రమైన ఆదర్శమూర్తి, ఆరాధ్యమూర్తీ రాముడు. భారతీయత అంటే శ్ర్రీరామ తత్త్వమే…
ఈ పద్యంలో శ్రీరాముని నామానికి, ధనుర్లీలకు, ఆయన గాధకు మ్రొక్కులు సమర్పించడంలో … రుద్రనమకంలోని ప్రథమశ్లోకంలో శివుని చేతిలోని విల్లుకు, ఆయన కోపానికి, ధనుస్సుకు నమస్కరించిన వేదసంస్కృతి ధ్వనిస్తున్నది కదా ?

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s