ఆంజనేయుడు త్రినేత్రుడా?!

ఇంతకీ ఆ స్వామి ఇటువంటి అవతారాన్ని ఎందువల్ల, ఏ సందర్భంలో ధరించినట్లు? ఆయనకు ఆ అవతారా న్ని ధరించడానికి ప్రేరణ ఏమిటన్న విషయానికి వస్తే ఓ అద్భుతమయిన కథ ఉంది.రామరావణ యుద్ధం ముగిసింది. శ్రీరామచంద్రమూర్తికి సం తోషంగా ఉంది. ప్రపంచమంతా పచ్చదనంతో కళకళలాడు తోంది. రాక్షసులంతా సంహరించబడటంవల్ల ఇకపెై భూమికి ఎటువంటి ప్రమాదమూ లేదు. ప్రజలంతా సుఖసంతోషాల తో వర్ధిల్లుతారని రామచంద్రుని మనోగతం. ప్రజల క్షేమమే కదా ఆ స్వామికి కావల్సింది.విభీషణుడు పుష్పక విమానాన్ని శ్రీరామచంద్రమూర్తికి సమ ర్పించాడు. అందరూ పుష్పక విమానంలో ఆసీనులయ్యారు. అలా తన పరివార సహితంగా శ్రీరాముడు అయోధ్యకు తిరు గు ప్రయాణమయ్యాడు. విమానంలో ఆత్మీయుల మధ్య కూర్చుని వెడుతూ, సంతోషంతో కబుర్లు చెప్పుకుంటూ పోతుండగా, ఈలోపు భరద్వాజ ముని ఆశ్రమం వచ్చింది. నాడు పంచమి తిథి. అప్పటికి పధ్నాలుగు సంవత్సరాలయ్యా యి. రాముని అభిమతం ప్రకారం, అందరూ భరద్వాజ ఆశ్రమంలో విడిది చేశారు.

అందరూ భరద్వాజ మహర్షికి నమస్కారాలు చేయగా, భర ద్వాజ మహర్షి రామపరివారాన్ని సంతోషంగా ఆహ్వానించి కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు ఆ మునితో, ‘‘ఓ మహాత్ముడా! అయోధ్యా నగరం సుభిక్షంగా ఉందా? అందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో ఉన్నారా? ఈ విషయం గురించి మీరు వింటున్నారా? భరతుడు చక్కగా రాజ్యపాలనం చేస్తున్నాడా? మా తల్లులందరూ క్షేమంగా ఉన్నారా?’ అని అడిగాడు. రా ముని ప్రశ్నలను విని సంతోషించిన భరద్వాజ మహర్షి రాము నికి వరాలను అనుగ్రహించాలనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పుడు రాముడు, ‘నేను అయోధ్యా నగరానికి పోతున్నాను. నేను వెళ్ళే దారిలో వృక్షాలన్నీ ఫలప్రదంగా ఉండాలి. వివిధ ఫలాలు అమృతంవలె ఉండాలి’ అని కోరుకున్నాడు. భర ద్వాజుడు తథాస్తు అన్నాడు. అనంతరం భరద్వాజుని కోరి క ప్రకారం ఆ ముని ఆతిథ్యానప్ని స్వీకరించాలనుకున్న రాము లవారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా ‘నారాయ ణా… నారాయణా..’ అనే శబ్ధం వినిపించింది.

నారదుడు!
‘శ్రీరామా! ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చించేందుకై నీ దగ్గరకు వచ్చాను’ అని అన్నాడా కలహభోజనుడు.
‘చెప్పండి నారదా!’
‘ఏమిటి రామయ్యా! చాలా సంతోషంగా ఉన్నట్లున్నావ్‌? రావ ణ సంహారం జరిగినందువల్ల సంతోషమా? రావణసంహారం జరిగినప్పటికీ, దుష్టసంహారం ఇంకా ముగియనప్పుడు ఈ సంతోషమేమిటి రామా?!’
శ్రీరాముడు విస్మయంతో నారదునివెైపు చూశాడు.
‘అవును రామయ్యా! నీ వింటికి ఇంకా పని కల్పించాల్సి ఉంది’.
‘వివరంగా చెప్పండి నారదా!’

‘రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసిందనుకుంటున్నావు. అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకారేచ్ఛతో, వారు ఊగిపోతున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడనే రాక్షసులు నిన్ను గెలిచేందుకై సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. వారు, శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే, ఆ రాక్షసులను అడ్డుకోవడం కనా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోనవ్వాల్సి ఉంటుంది.

అందుకే రామయ్యా! నువ్వు త్వరగా ఆ ముష్కరులను అంతం చేసే దిశగా ఆలోచించు’

‘రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసింద నుకుంటున్నాశ్‌. అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకా రేచ్ఛతో, వారు ఊగిపోతున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడనే రాక్షసులు నిన్ను గెలిచేందుకై సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. వారు, శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే, ఆ రాక్షసులను అడ్డుకోవడం కనా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోనవ్వాల్సి ఉంటుంది. అందుకే రామయ్యా! నువ్వు త్వరగా ఆ ముష్కరు లను అంతం చేసే దిశగా ఆలోచించు’ నారదుని మాటలను విన్న రాముడు ఒక నిముషం ఆలోచించాడు. రాముని దీర్ఘా లోచన నారదులకు ఏమీ అర్థం కాలేదు. ఈ స్వామి ఇంతసేపు ఆలోచిస్తున్నాడేమిటి? అదే విషయాన్ని స్వామి దగ్గర అడిగాడు.

‘అంత దీర్ఘాలోచన ఏమిటి రామా?!’ నారదుడు చిరునవ్వు నవ్వాడు.
‘నారదా! నేను ప్రస్తుతం అయోధ్యకు తిరుగు పయనమయ్యాను. మీకు తెలుసు కదా! నేను చెప్పిన సమయంలోపు అయోధ్యకు చేరుకోకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఏం చేయాలి?
‘లక్ష్మణుని పంపవచ్చు కదా!’
‘తను నా నీడవంటి వాడు మహర్షీ! నన్ను వదలి ఉండనని శప థం చేసాడు కదా! ఆ సంగతి కూడా మీకు తెలుసు కదా’ అని మా ట్లాడుతున్న రాముని దృష్టి హనుమంతునిపెై పడింది. రాముని వదనారవిందం ప్రకాశవంతమైంది.
‘ఆంజనేయా! ఇలా దగ్గరకు రావయ్యా’ అని పిలిచాడు.
‘స్వామి?!’
‘నా ప్రియమైన హనుమంతా! రాక్షస సంహారం నీ చేతుల మీదు గా జరుగనివ్వు’ అని ఆతతిచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. క్షణంలో ఆంజనేయునికి స్వామి ఆనతిచ్చిన విషయం ముల్లోకాలకు పాకింది.

అసురశక్తులను కూకటివ్రేళ్ళతో పెకిలించి వేయాల్సిన యుద్ధం కదా! అక్కడ ముక్కో టి దేవతలు గుమిగూడారు. ఆంజనేయుని విజయం కోసం దేవతలంతా ఆశీర్వదిం చారు. జయజయుధ్వానా లతో ఆ ప్రాంత మంతాప్రతిధ్వనించింది.‘జయమగుగాక!’ అని ఆశీర్వదించిన విష్ణు భగవానుడు, తన శం ఖుచక్రాలను హనుమంతునికి ఇచ్చాడు. ఆ శుభదృ శ్యాన్ని చూసి న బ్రహ్మ దేవుడు, తన బ్రహ్మ కపాలాన్ని అనుగ్రహిం చాడు. ఇలా ఒక్కొక్క దెైవం తన శక్తియుక్తులను హనుమంతునికి అందించ సాగారు. అన్ని ఆయుధాల ను స్వీకరించిన ఆంజనేయు డు పది చేతులతో, ఆ చేతులలో పది ఆయుధాలతో గోచరించాడు.

ఆహా! ఆ దృశ్యం ఎంత అద్భుతం!!

అక్కడ శివపరమాత్మ అరుదెంచాడు. హనుమంతుని చూసాడాయన. పదిచేతులలో పదిరకాలెైన ఆయుధాలు! ఆ రూపంలో ఆంజనేయుడు అద్భుతంగా ఉన్నాడు. తను హనుమకు ఏదో ఒకటి బహుకరించాలి. ఇంతకీ తనేమివ్వాలి?! వెంటనే తన మూడవకన్నును ఆంజనేయునికి బహూకరించాడా భోళాశంకరుడు.ఈ ఆంజనేయస్వామి రూపాన్ని చూసినంత మాత్రంలోనే రాక్షసుల గుండెలు ఆగిపోవా?! గరుడభగవానుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి?: హనుమం తునికి తన రెక్కలను బహూకరిం చాడు. అలా రాక్షసులను అంతమొం దించేందుకై హనుమ బయలుదేరు తున్న సమయం. అక్కడ శివపరమా త్మ అరుదెంచాడు. హనుమంతుని చూసా డాయన. పదిచేతులలో పదిరకాలెైన ఆయుధాలు! ఆ రూపంలో ఆంజనేయుడు అద్భుతంగా ఉన్నాడు. తను హనుమకు ఏదో ఒకటి బహుకరించాలి. ఇంటకీ తనేమివ్వాలి?!

వెంటనే తన మూడవకన్నును ఆంజనేయునికి బహూకరించా డా బోళాశంకరుడు.

మూడుకళ్ళు, పదిచేతులతో, రెక్కలను విసురుకుంటూ హను మ రాక్షస సంహారానికి బయలుదేరాడు. త్రినేత్ర దశభుజ వీరాంజనేయస్వామి వస్తున్న శబ్దాన్ని విన్న రక్తబిందు, రక్తాక్ష రాక్షసుల గుండెలు అదిరాయి. భయంతో పరుగులు తీశారు.

హనుమంతుడు వదులతాడా ఏమిటి?
అదీ రామకార్యం కదా మరి!
మూడవకన్నును తెరిచాడు. పదిచేతుల్లోని ఆయుధాలను ప్రయోగించాడు. రాక్షస సంహారం జరిగింది. అయిన ఆంజనే యుని కోపం చల్లారలేదు. ఉగ్రరూపంతో తిరిగిరాసాగాడు. ఆయన కోపం చల్లారలేదు.అలా వస్తుండగా, ఒకచోటుకి చేరుకునేసరికి ఆహ్లాదకరమైన ప్రకృతి ఆయన్ని ఆహ్వానించింది. ఆ ప్రశాంత వాతావరణం ఆయన కోపాన్ని చల్లబరిచింది. అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకున్నాడాయన. ఆయన ఆనందించిన ఆ ప్రదేశమే అనం తమంగళం. ప్రస్తుతం ఆస్వామి కొలువయిన పుణ్యస్థలం.తమిళనాడులో చిదంబరం, కారెైక్కాల్‌ మధ్యన ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో ఈ ఆలయాన్ని చూడగలం. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన శ్రీరాజగోపాలపెరుమాళ్‌ ఆలయ ప్రాంగణంలో ఈ త్రినేత్ర దశముఖ ఆంజనేయస్వామి కొలు వయి ఉన్నారు. ప్రధాన ఆలయంలో ఉత్సవమూర్తిని దర్శించుకుంటాం.

రాజగోపాలపెరుమాళ్‌ ఆలయంలో కొలువయి ఉన్న అమ్మవారి పేరు పెన్బగపల్లీ అమ్మవారు. ఇంకా ఈ ఆల యప్రాంగణంలో శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు, ఆళ్వారులు, విష్వక్సేనుడు కొలువయి భక్తులను అలరిస్తు న్నారు. గర్భగుడిలో వాసుదేవుడు, ఉత్సవమూర్తి రాజగోపాలుడు ఉభయదేవరులతో దర్శనమిస్తు న్నాడు.విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయం లో మార్గశిరమాసంలో శ్రీవెైకుంఠ ఏకాదశి, కార్తీక మాసంలో దీపోత్సవం పండు గలు బ్రహ్మాండంగా జరుపబడు తుంటాయి. ఆషాఢ, పుష్యమాసాల లో ప్రతి శుక్రవారం అభిషేక ఆరాధన లు జరుగుతుంటాయి. నవరాత్రి ఉత్సవాలు చివరిరోజు విజయదశమితో కలసి బ్రహ్మాండంగా జరుపబడతాయి. నెలలో అన్ని శనివారాలలో ఆంజనేయ స్వామికి అభిషేక ఉత్సవాలు జరుపబడుతుంటాయి. ఈ ఆల యంలో హనుమజ్జయంతి బ్రహ్మాండంగా జరుపబడుతుం టుంది. ఆ రోజున ప్రత్యేక అభిషేక పూజోత్సవాలతో పాటు, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి గురువారం గరుడునికి ప్రత్యేక అభిషేక సేవ జరుపబడుతుంటుంది. ఆల యం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరలా మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని పుష్కరిణిని హనుమాన్‌ తీర్థం అని పిలుస్తుంటారు.

ఈ ప్రాంత భక్తులు 48 రోజులపాటు హనుమాన్‌ దీక్షను తీసు కుని, కఠోరనియమాలతో దీక్షను సాగించి 48వ రోజున దీక్ష ను ముగిస్తారు. ఈ విధంగా దీక్ష చేయడం దల్ల అనుకున్న పనులతో విజయం లభిస్తుందని స్థానిక భక్తులు చెబుతుం టారు. ఈ క్షేత్రదర్శనం మనకు ఎన్నో శుభాలను చేకూర్చు తుంది. ఎందుకంటే ఆయన దగ్గర రామభక్తి అనే రసాయనం ఉంది. అందుకే ఆయన తనను ప్రార్థించిన భక్తులకు శుభా లను అందిస్తున్నాడు. వారు తలచిన కార్యాలను నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాడు. అంతా శుభకరంగా అనుగ్రహిస్తున్నాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s