కొండ గట్టు శ్రీ ఆంజనేయ దేవాలయం

తెలంగాణా ప్రాంతం లో ప్రసిద్ధి చెందినశ్రీ హనుమాన్ దేవాలయాలలో శ్రీ కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత విశిష్ట మైనది .,భక్తులకు కొంగు బంగారమైనదీ .కరీం నగర్ జిల్లా లో ఉన్న ఈ ఆలయం అత్యధిక భక్త జన సందోహాన్ని ఆకర్షించి ,ప్రతి వారికి ఆ స్వామి గుండెల్లో కొలువై ఉండేట్లు చేసింది .దీని వైభవం మాటలతో వివ రించ లేనిది .

ఈ దేవాలయం త్రేతాయుగానికి చెందినదనే విశ్వాసం ప్రజలకు ఉన్నది .ఆ కాలం లో ఋషులు ఈ ప్రదేశం లో యజ్న యాగాలను నిర్వ హిస్తు ,తపస్సు చేసుకొంటూ గడిపెవారట .రామ రావణ యుద్ధం లో మూర్చ పోయిన లక్ష్మణ స్వామి మూర్చను పొగొట్ట టానికి ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని పేక లించుకొని వస్తుండగా ,ఇక్కడి మహర్షులు ఆయన్ను సాదరం గా ఆహ్వానించారు .ఆయన వ్యవధి లేదని చెప్పి ,తాను త్వరలోనే తిరిగి వస్తానని వాగ్దానం చేసి వెళ్ళి లక్ష్మణుని మూర్చ నుండి తేరుకోవటానికి సహాయ పడ్డాడు .ఎంతో కాలం ఇక్కడి మహర్షులు అంజనాసుతుని రాక కోసం వేయి కన్ను లతో ఎదురు చూశారు .కాని ఫలితం శూన్యం .అప్పుడు రుషులందరూ ఆలోచించి ,గ్రహ నాదులకు శత్రువు అయిన భూత నాధుడైన ‘’భేతాళుడి ‘’ని ప్రతిష్ట చేశారు .అయినా హనుమ జాడ లేడు.ఋషులు చివరి ప్రయత్నం గా తమ ఉపాసనా ,తపశ్శక్తులన్నిటినీ ధారపోశారు .అప్పుడు పవన సుత హనుమాన్ కరుణించి ఇక్కడ స్వయంభు గా వెలిశాడు .ఆ నాటి నుండి ఋషులు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ,కీర్తిస్తూ ,పూజిస్తూ నిర్విఘ్నం గా తపస్సు ,యజ్న యాగాదులను నిర్వహించారు .

చారిత్రిక విషయానికి వస్తే –సుమారు 400సంవత్స రాల క్రితం ‘’సింగం సంజీవుడు ‘’అనే యాదవుడు’’కొడిమ్యాల పరగణా ‘’లో ఆవులను మేపు కొంటూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు .ఒక ఆవు తప్పి పోయింది .దాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు .అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద నిద్ర పోయాడు .అప్పుడు స్వప్నం లో హనుమ కన్పించి తాను ‘’కోరంద పొదలో ‘’ఉన్నానని బయటికి తీసి ఎండకు, వానకు రక్షణ కల్పించమని ,కోరి అతని ఆవు వెంటనే కని పిస్తుందని చెప్పాడు .నిద్ర నుంచి సంజీవుడు ఉలిక్కి పడి లేచి, స్వామిని స్మరిస్తూ ,ఆవు ను వెదక టానికి బయల్దేరాడు .అప్పుడు కోటి సూర్య ప్రభా భాస మానం గా సంజీవ రాయడు అతనికి సాక్షాత్కరించాడు .ఆనంద బాష్పాలు రాలుస్తూ సంజీవుడు శ్రీ హనుమ పాదాలపై బడి కీర్తించాడు .ఇంతలో దూరం నుండి ఆవు అంభా రావాల తో అక్కడికి చేరింది .సంజీవుడు చేతిలో ఉన్న గొడ్డలి తో కోరంద పొదను చేదించాడు .అక్కడ శంఖు ,చక్ర ,గదా ,లంకరణం తో విశ్వ రూపాత్మకుడైన పంచముఖాలలో ఒక టైన నారసింహ వక్త్రం తో ఉత్తరాభి ముఖం గా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి పరమానందంతో పరవశించి పోయాడు .తన అదృష్టానికిముగ్ధుడై, మురిసి పోయాడు ..తరువాత తన స్నేహితులు బంధువులనందరిని తీసుకొని వచ్చి చూపించి ,స్వామికి చేత నైనంత లో ఒక ఆలయాన్ని నిర్మించాడు .ఇక్కడ స్వామి రెండు ముఖాతో వెలసిలి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత .ఇలా ద్విముఖ ఆంజనేయ మూర్తి ఎక్కడావెలసి నట్లు. లేదు .స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక శంఖము ,చక్రము ,వక్షస్థలం లో శ్రీ రాముడు ,సీతా సాధ్వి లను కలిగి ఉండటం ప్రత్యేకతలలో ప్రత్యేకత .

కొండ గట్టు ప్రాంతం అంతా అనేక రాళ్ళు ,కొండలున్న ప్రదేశం .నల్ల రాయి ఇక్కడి ప్రత్యేకత .దట్టమైన అరణ్య ప్రాంతం .చుట్టూ అనేక గుహలున్నాయి .అనేక రకాలయిన వృక్ష సమూహం తో ప్రకృతి అందానికి పట్టు గొమ్మ గా ఉంటుంది .దానికి మనసు పరవశం చెందు తుంది .ఆ ప్రకృతి శోభకు ముగ్దుల మవుతాం .కొండ గట్టు మీదే స్వామి వెలసి ఉన్నందున ‘’కొండ గట్టు శ్రీ ఆంజనేయ స్వామి ‘’అని భక్తులు ఆప్యాయం గా భక్తితో పిలుచు కొంటారు .

సంజీవ పర్వతాన్ని ఆంజనేయ స్వామి అరచేతిలో పెట్టుకొని వస్తుండగా ,అందు లోంచి ఒక ముక్క రాలి కింద పడి ఈ ‘’పవిత్ర మైన కొండ గట్టు ‘’ఏర్పడిందని స్థానిక కధనం ఈ దేవాలయం కరీం నగర్ కు 35కి.మీ.దూరం లో ఉంది .ఇప్పుడున్నఆలయాన్ని160 ఏళ్ళ క్రితం శ్రీ కృష్ణా రావు దేశ్ ముఖ్ నిర్మించారు .స్త్రీలు నలభై రోజులు భక్తితోశ్రీ కొండ గట్టు ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగు తుందని భక్తుల పూర్తి విశ్వాసం .దీనికి అనేక వేల నిదర్శనలున్నట్లు స్థానికులు చెబుతారు .హనుమంతుని జన్మ దిన మైన చైత్ర పౌర్ణమి నాడు శ్రీ హనుమజ్జయంతి ని ఘనం గా నిర్వ హిస్తారు .తండోప తండాలు గా భక్త జన సందోహం వచ్చి స్వామిని దర్శించి ,పూజించి సఫల మనో రధు లవుతారు ..ఆలయ సమీ పం లో ఉన్న ‘’కొండల రాయ కోట ‘’,బోజ్జి పోతన గుహ ‘’భక్తులను విశేషం గా ఆకర్షిస్తాయి .

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s