కర్తవ్యానికి వెన్నుతట్టడమే గీతోపదేశం

శ్లో!! యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతం
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ వీదృశం్ప్ప

పార్థా! అప్రయత్నంగా ప్రాప్తించేది, స్వర్గానికి తెరిచి ఉంచిన వాకిలి వంటిది అయిన ఈ యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకే లభించును.

శ్లో!! అథచే త్త్వమిమం ధర్మ్యం సంగ్రామంత న కరిష్యసి
తత స్స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి్ప్ప

ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయకుం డినచో స్వధర్మమును, కీర్తిని పోగొట్టుకొనుటయే గాక పాపమును కూడా పొందెదవు.
శ్లో!! అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం
సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే్ప్ప

లోకులు నీయొక్క అపకీర్తిని శాశ్వతంగా చెపð కుంటారు. మాననీయునకు అపకీర్తి కన్నను మర ణమే మేలు.

శ్లో!! భయాద్రణా దుపరతం
మంస్యన్తే త్వాం మహారథాః
యేషాం చత్వం బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్‌్ప్ప

ఇంతవరకూ నిన్ను గొప్పగా గౌరవించిన మహారథు లకు నీవు చులకన యగుదువు. నీవు భయము వలన యుద్ధము మానినట్లు వారు భావిస్తారు.

శ్లో!! అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః
నిదంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్‌్ప్ప

నీ శత్రువులు నీ సామర్థ్యము నిందిస్తూ, నిన్ను ఎన్నో అనరాని మాటలు అంటారు. దానికి మించిన దుఃఖంమేమున్నది

శ్లో!! హతో వా ప్రాప్స్యసే స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌతేయా
యుద్ధాయ కృతనిశ్చయః్ప్ప

అర్జునా! చంపబడినచో స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యము అనుభవింతువు. కనుక యుద్ధమునకు కృతనిశ్చయుడవు కమ్ము.

శ్లో!! సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి్ప్ప

సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు సమంగా భావించి యుద్ధం చేయి. అలా చేస్తే నీకు ఎటువంటి పాపమూ అంటదు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s