ఆచమనం విధానం.

శుభ్రమైన ప్రదేశంలో తూర్పు ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కానీ ఆసనం పైన కూర్చుని కుడి చేయిని ”గోకర్నాకృతిలో” ఉంచుకోవాలి. అనగా చూపుడు వేలిని పైకి చూసేట్టుగా, బొటనవేలిని కింది నుండి చూపుడువేలి చుట్టూ ఉంచాలి.మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వెళ్లను అడ్డంగా ఉంచాలి. దీన్నే గోకర్నాకృతి అంటారు. అంటే ఆవు చెవి ఆకారం అని అర్ధం.
గోకర్నాకృతి చేతిలో మినప గింజ మునిగేంత నీరు మాత్రమె పోసుకొని ‘ ఓం కేశవాయ స్వాహా ‘అని శబ్దం రాకుండా [సుర్ర్ర్ర్ర్ర్ర్ర్ మనడం] తీసుకోవాలి. అదేవిధంగా ‘ ఓం నారాయణాయ స్వాహా’, అని రెండవ సారి, ‘ ఓం మాధవాయ స్వాహా’, అని మూడవ సారి తీసుకోవాలి. నాల్గవసారి చేతికి నోరు ఏ భాగం తాకిందో ఆ భాగం పైన నీళ్ళు పోసి వదిలేయాలి.
ఆ తరువాత బొటనవేలితో నీటిని తాకి ఆ నీతితో మడత కింది పెదవిని ఆపైన పై పెదవిని తుడుచుకోవాలి. బొటన వేలు చోపుడు వేలితో ముక్కు రెండు రంధ్రముల భాగములను, బొటనవేలు మధ్య వేలితో రెండు నేత్రములను, బొటన వేలు ఉంగరం వేలితో రెండు చెవులను ,బొటన వేలు చిటికెన వేలుతో నాభిని [ బొడ్డు] , అరచేతితో హృదయమును, అన్ని వేళ్ళతో శిరస్సును తాకాలి.

Advertisements