లక్ష్మిదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు(దీపావళి)

లోక కంటకుడైన నరకాసురుడు మరణించినందుకు, కృష్ణుడి విజయానికి సంకేతంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపాలు వెలింగించి అమావాస్య రోజు చీకటి కనిపించనంత దీపాలు వెలిగించారట.అందుకే దీపావళి అంటారు.

ఈ మూడు రోజులు లక్ష్మీ దేవి నువ్వులనూనె ఉంటుంది,అందుకే నువ్వులనూనెతో ఈ మూడు రోజులు దీపాలను ఉదయం సాయంత్రం వెలిగించాలి.

గోశాలలో చక్కగా శుభ్రం చేసి కల్లాపి చల్లి రంగావల్లికలతో ముగ్గులు వేసి గో పూజ చేసి ఆ రంగావల్లికల పైన దీపాలను పెట్టాలి.

దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదెవిని పూజిస్తాము ఈ రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు.

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. “నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని” సమాధానమిచ్చింది.

అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఈ రోజు ఆబాలగొపాలమన్తా బాణా సంచాలు కాలుస్తారు. ఇది దీపావళి రోజే ఎందుకు కాలుస్తారు అనేది అంతు చిక్కడం లేదు, కాని ఇలా చేయడం లో ‘సైంటిఫిక్ రీసన్’ ఉంది.

వర్షరుతువులో వర్షపాతం అధికంగా ఉంటుంది కదా.. ఈ సమయంలో భూమి పై తేమ చెడి (భూమి పరిస్తితిని బట్టి) ఇటు మానవాళికీ అటు పంటలకు కీడు చేసే సూక్ష్మ క్రీములు అధికమవుతాయి. ప్రజలకు అనేక అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. కనుక పూర్వం లక్క, నూనె, పాదరసం, గంధకం వంటి పదార్థాలతో టపాసులు తయారు చేసి కాల్చే సాంప్రదాయం మొదలయ్యింది. ఆ పేలుడు శబ్దానికి, వెలుగులకి, గంధకం వాసనకి, పొగకి ఈ
సూక్ష్మ క్రీములు నశిస్తాయి.ఫలితంగా ప్రజలు పంటలతో పాటు నివాస ప్రాంతాలు ఆరోగ్యంగా ఉండేవి.వినోదంతో పాటు పర్యావరణ సంరక్షణ జరిగేది.