‘ఓం నమో భగవతే వాసుదేవాయ

1394433_546006428824240_1342022454_n

 

”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రంలో ”ఓం” తరువాత ప్రయుక్తమైన శబ్దం ”నమః”. దీనిలో ‘న’ ‘మః’ అనే రెండు పదాలున్నాయి. అవి నేనున్నది (ఆత్మ, జీవుడు) నాసేవ కొరకు కాని పరులసేవ కొరకూ గాని కాదు. భగవంతుడి సేవకోరకే. అనే అర్ధాన్ని వెల్లడిస్తాయి. నేను నాకు గాని, ఇతరులకు గాని సంభందపడినవాడిని కాను. ఆ పరమాత్మకే సంబందించినవాడిని అని భావిస్తూ తానూ చేసే కైంకర్యములు చేసే ఖర్మ యందు కర్తృత్వ భోక్తృత్వ బుద్ది మాని పరమాత్ముడే తన పరికరమైన నాచేత తన కైంకర్యములు తనే చేయించుకొంటున్నాడు. తానే దాని ఫలమనుభావిస్తున్నాడు. ఇందులో నా ప్రసక్తి ఏమిలేదు అని భావిస్తూ ద్యానం సల్పాలి అని నమః శబ్దం యొక్క తాత్పర్యం. భగవంతుడైన వాసుదేవుడికే తప్ప నాసేవకోరకు కాదు. అన్యుల సేవకోరకూ కాదు. అని ఈ మంత్రం భావం. భగవంతుడనగా జ్ఞాన బలైశ్వర్య వీర్యశక్తి తెజస్సులనే షడ్గుణ్య సంపత్తికలవాడు. వసుదేవ సుతుడైన శ్రీకృష్ణుడు గాని, తనయందు సమస్తం వసించగా అన్నిటియందు నివసించేవాడు అనిగాని వాసుదేవుడనే మాటకు అర్ధం. జీవుడు ఉన్నది మాధవ సేవకే గాని అన్యుల సేవకొరకు కాదు.

Advertisements