మరణానంతర ఆనందం

నవరాత్రి పండగకు ముందే వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన జీవితానికి దోహదపడ్డ ముందు తరాల పట్ల కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితమైన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, చనిపోయిన వారికి ఉత్తర కర్మల ద్వారా ఇలా ఒక అనుకూల వాతావరణం సృష్టించే ప్రాముఖ్యతను గురించి ఈ ప్రస్తావన.
ఎవరైనా చనిపోతే, అతనికి తన మరణాన్ని సరిగ్గా నిర్వహించే అవగాహన లేకపోతే అప్పుడు మరెవరో అతనికై కొన్ని క్రతువులు చెయ్యడమన్నది యోగ సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడదంతా వాణిజ్యంగా మారింది. అందుకే లింగ భైరవిని శక్తి మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారికోసం ‘కాల భైరవ కర్మ’, ‘కాలభైరవ శాంతి’ అనే కొన్ని నిర్ధిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాం. ఒక వ్యక్తి చనిపోయిన 14 రోజుల లోపు వారు బతికున్నప్పుడు ధరించిన ఒక వస్త్రంలోని ఒక చిన్న గుడ్డ ముక్కను పంపితే ఒక నిర్ధిష్ట క్రతువు నిర్వహించవచ్చు.

మరణం అంటే, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు అతను తన దేహాన్ని, జీవితమని తెలిసిన ప్రతీదాన్ని కోల్పోయాడు. అంతే! దేహాన్నే కాదు తన విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు. ఉదాహరణ.. మద్యం లేదా డ్రగ్స్ తీసుకున్నప్పుడు వారికి జగిగేదేమిటి? విచక్షణ కోల్పోవడం! సంతోషంగా ఉన్నచోట వారి వివేకాన్ని కోల్పోతే వారు మరెంతగానో సంతోషానికి గురవుతారు. కానీ అదే చోట విచారంగా ఉంటే మరింత విచారానికి గురవుతారు. మందు లేదా మత్తు మందు దానంతటదే ఆహ్లాదాన్ని లేక విచారాన్ని కలుగజెయ్యదు. వారి స్థితి ఏదైనా, అదే అతిశయమవుతుంది. ఎందుకంటే మనసు విచక్షణ దిగజారింది!

శరీరాన్ని కోల్పోయినప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ మరింత అధికంగా జరుగుతుంది. విచక్షణా మనసు అసలు ఉండనే ఉండదు. అత్యంత విచారకరమైన స్థితిలోకి అతను పతనం చెందితే, దాన్నే నరకం అంటాం. అతను చాలా ఆనందకరమైన స్థితిపై కి వెళ్తే దాన్నే స్వర్గం అంటాం. నరకం, స్వర్గం అనేవి ఒక భౌగోళిక ప్రదేశాలు కావు.
ఎవరైనా చనిపోతున్నప్పుడు పఠించడానికి భారతీయ సంస్కృతిలో మీకు ఏదో మంత్రం నేర్పి ఉంటారు. దాని ఉద్దేశం…ఆ మంత్రం పఠిస్తే ఒక నిర్ధిష్ట సంతోషాన్ని సృష్టించుకోవడమే. ఆ శబ్దాలు చనిపోయిన వారిలో ఒక నిర్ధిష్ట ఆనంద కంపనలు తెస్తాయి. కనుకే భారతీయ సంస్కృతిలో నిర్ధిష్ట మంత్రాలను సృష్టించారు. ఎందుకంటే సంస్కృతికి రూపకల్పన చేసినవారు ఉద్వేగాలకు, చింతనలకు లోను కాలేదు. వారు కేవలం వారి అవగాహన, అనుభూతులకు తావిచ్చారు. తమను తాము ఒక నిర్ధిష్ట మార్గంలో నిర్వహించుకున్నారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు కూర్చుని మాత్రమే మంత్రాన్ని జపించాలి.

సంప్రదాయంగా.. భారతీయులు వారికి ప్రియమైన వారి మధ్య చనిపోవాలని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే కుటంబంలో చనిపోతే, ఎన్నో భావోద్వేగాలు ప్రకటితమౌతాయి. ఆధ్యాత్మికంగా అనుకూలమైన, సచేతనమైన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం నిజంగా తెలివైన పని. అతను అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని వదిలి వెళ్తాడు. హుందాగా జీవించి ఉంటే హుందాగా మరణించడం కూడా ముఖ్యమే. ముసలితనంలో ఒంటరిగా చనిపోవడానికి కొందరు కాశికి వెళ్తారు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య చనిపోతే మీరు వారి వంక అనురాగంతో చూస్తారు. సులువుగా విడిపోయేందుకు వీలుకాదు. ఆ విచారం పెరిగి పెద్దదై మిమ్మల్ని ఏదో భయంకరమైన దానిలోకి నెడుతుంది. అది ఇతరులకు కూడా మంచిది కాదు. అందుకే మరణం వచ్చినప్పుడు దూరంగా వెళ్లి ఒంటిరిగా చనిపోతారు. ఇవి ఉద్వేగాల పరంగా లేక ఆలోచనల పరంగా చేసే పనులు కావు. ఇవి ఒక నిర్ధిష్ట అవగాహన, మరణం గురించిన జ్ఞానంతో చేయబడేవి.

ఒక వ్యక్తి ముసలితనం వల్ల మరణించినప్పుడు మనం ఇంకా ఆ జీవితంలోకి ఆనందాన్ని పారేలా చేసేందుకు 11-14 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి మీరు ఒక్క చుక్క ఆనందాన్ని అతనిలో వేసినా అది కొంత కాలం తరువాత ఆనంద సాగరమవుతుంది. ఎందుకంటే అతనికి వివేకం లేదు. అతను ఆ ఆనందాన్ని ఆపలేడు. ఎందుకంటే అక్కడ తట్టి చెప్పేందుకు విచక్షణా మనసు ఉండదు. అది పెరిగి, ఉధృతమై సాధారణంగా స్వర్గం అనబడే ఒక అతిశయమైన ఆనంద జ్ఞానంలోకి నెడుతుంది. ముసలి వయసులో చనిపోతే మనం ఈ ఆనందపు చుక్కను ఆ జీవిలోకి 14 రోజుల వరకు వెయ్యగలుగుతాం. 40ఏళ్ల లోపు చనిపోయినా, యవ్వనంలో ఉన్నా, జీవితం ఇంకా ఫలవంతంగా ఉన్నా, శరీరం పతనమై జీవన క్రియల ఆచరణకు యోగ్యం కాకుండా పోతుందో అప్పుడు 48 రోజుల వరకూ ఈ ఆనందపు చుక్కను వెయ్యగలుతాం. స్పందనతో ఉంటే 90రోజుల వరకూ అలా ప్రభావితం చెయ్యగలం. 50-55 ఏళ్ల వయసులో చనిపోతే గనక 48 రోజుల వరకు ప్రభావితం చెయ్యగలుగుతాం.

Advertisements