బాలకాండము – ఐదవసర్గము

అయోధ్యానగరవర్ణనము

సర్వా పూర్వం ఇయం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధరా |
ప్రజపతిం ఉపాదాయ నృపాణం జయ శాలినాం |1-5-1|
యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్టిః పుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్ |1-5-2|
ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం |
మహద్ ఉత్పన్నం ఆఖ్యనం రామాయణం ఇతి శ్రుతం |1-5-3|
తదిదం వర్తయిష్యావః సర్వం నిఖిలం ఆదితః |
ధర్మ కామ అర్థ సహితం శ్రోతవ్యం అనసూయతా |1-5-4|
సప్తద్వీపములతోగూడిన ఈ సమస్త భూమండలమునమనుప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులుపరిపాలించిరి. ఈవంశమున సగరుడనువాడు సుప్రసిద్ధుడు. ఈసగరునిఆఱువేలమంది కుమారులును యజ్ఞాశ్వనిమిత్తమైసముద్రమును త్రవ్విరి. కావునదానికి సాగరము అని పేరువచ్చెను. ఈ ఇక్ష్వాకువంశమున మహానుభావులైన ఎందఱోరాజులు జన్మించి, వంశమునకు వన్నెదెచ్చిరి. అట్టిమహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము.బ్రహ్మానుగ్రహప్రభావమున రూపుదిద్దుకొనిన ఈరామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇదిధర్మాకామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టిదోషదృష్టియు లేకుండ వినవలసినది, పఠించవలసినది. [1 – 4]

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్ట సరయూ తీరే ప్రభూత ధన ధాన్యవాన్ |1-5-5|
సరయూనదీతీరమున “కోసల” అను సుప్రసిద్ధదేశము గలదు.అది ధనధాన్యసంపదలతో తులతూగుచున్నది. కనుకఅచటిజనులు మిక్కిలి సంతుష్టులైయుండిరి. [5]

అయోధ్యా నామ నగరీ తత్ర ఆసీత్ లోక విశ్రుతా |
మనునా మానవ ఇంద్రేణ యా పురీ నిర్మితా స్వయం |1-5-6|
ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సు విభక్తా మహాపథా |1-5-7|
రాజ మార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తా పుష్ప అవకీర్ణేన జల సిక్తేన నిత్యశః |1-5-8|
ఆ కోసలదేశమున “అయోధ్య” అను పేరుగల ఒక మహానగరముగలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగానిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోకప్రసిద్ధి వహించెను. ఆమహానగరము పండ్రెండు యోజనముల పొడవును,మూడుయోజనముల వెడల్పును గలిగి మిక్కిలి విశాలమైఅపుర్వశోభలతొ విలసిల్లుచున్నది. అచటివీధులు ఇరువైపులవృక్షములతో విరాజిల్లుచు విశాలములై యున్నవి. ఆపురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకలపూలవృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆరాజమార్గము చెట్లనుండి రాలిన పుష్పములతో నిండి,చూడముచ్చటగానున్నది. [6 – 8]

తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః |
పురీం ఆవాసయామాస దివి దేవపతిః యథా |1-5-9|
కోసలదేశమును ధర్మమార్గమున పరిపాలించుచున్నదశరథమహారాజు దేవేంద్రుడు అమరావతినివలె అయోధ్యాపురవైభవమును ఇనుమడింపజేసెను. [9]

కపాట తోరణవర్తీ సు విభక్త అంతరాపణాం |
సర్వ యంత్ర అయుధవతీం ఉషితాం సర్వ శిల్పిభిః |1-5-10|
సూత మాగధ సంబాధాం శ్రీమతీం అతుల ప్రభాం |
ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్నీ శత సంకులాం |1-5-11|
ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను,ద్వారబంధములతోడను అలరారుచుండెను, నగరమధ్యభాగమున వరుసలు దీరియున్న అంగళ్ళతో అదిమనోహరముగానుండెను. అచ్చట వివిధములగు యంత్రములు,ఆయుధములు అమర్చబడి యుండెను. అన్ని కళలయందునునిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచినస్తుతిపాఠకులు, వందిమాగధులు గలరు, అది ధనధాన్యసంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోటబురుజులతోను,ధ్వజములతోను, వందలకొలది శతఘ్నులతోను ఆ పురిరాజిల్లుచుండెను. [10 – 11]

వధూ నాటక సంఘైః చ సంయుక్తాం సర్వతః పురీం |
ఉద్యాన ఆమ్ర వణోపేతాం మహతీం సాల మేఖలాం |1-5-12|
దుర్గ గంభీర పరిఖాం దుర్గాం అన్యైః దురాసదం |
వాజీవారణ సంపూర్ణాం గోభిః ఉష్ట్రైః ఖరైః తథా |1-5-13|
ఆ పురి నృత్యకళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను.అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టునుగలవిశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డాణమువలెమనోజ్ఞముగానుండెను.దాని చుట్టును విశాలమైన లోతైనఅగడ్తయు, శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందుమేలుజాతికి చెందిన గుఱ్ఱములు, వేగముగాసాగిపోగలఏనుగులు, వృషభములు, ఒంటెలు, అసంఖ్యాకముగా గలవు. [12 – 13]

సామంత రాజ సంఘైః చ బలి కర్మభిః ఆవృతం |
నానా దేశ నివాసైః చ వణిగ్భిః ఉపశోభితాం |1-5-14|
ప్రాసాదై రత్న వికృతైః పర్వతైః ఇవ శోభితాం |
కూటాగారైః చ సంపూర్ణాం ఇంద్రస్య ఇవ అమరావతీం |1-5-15|
కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంతరాజులసందడితో ఆనగరము కలకలలాడుచుండెను. క్రయవిక్రయములకై ఏతెంచెడివివిధదేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి యుండెను.రత్నములు పొదిగిన రాజగృహములతోడను,క్రీడాపర్వతములతోడను, అంతస్తులతోగూడిన మేడలతోనుఒప్పుచు అది ఇంద్రుని అమరావతినగరమువలెవిరాజిల్లుచుండెను. [14 – 15]

చిత్రం అష్టాపద ఆకారాం వర నారీ గణైర్ యుతాం |
సర్వ రత్న సమాకీర్ణాం విమాన గృహ శోభితాం |1-5-16|
గృహ గాఢాం అవిచ్ఛిద్రాం సమ భూమౌ నివేశితాం |
శాలి తణ్డుల సంపూర్ణాం ఇక్షు కాణ్డ రసః ఉదకాం |1-5-17|
జూదపు పలకవలె “అష్టాపదాకారములోనున్నచిత్రచిచిత్రములైన రాజగృహములతో అదియొప్పుచుండెను.అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను.నానావిధరత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమునుతాకుచుండెడి ఎత్తైన భవనములతో శొభిల్లుచుండెను.అచటిగృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములును లేకుండసమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసియుండెను. ఆ పురముమేలైన వరిబియ్యముతో, చెఱకురసమువంటిమధురజలములతో సమృద్ధమై యుండెను. [16 – 17]

దుందుభీభిః మృదంగైః చ వీణాభిః పణవైః తథా |
నాదితాం భృశం అత్యర్థం పృథివ్యాం తాం అనుత్తమాం |1-5-18|
విమానం ఇవ సిద్ధానాం తపస అధిగతం దివి |
సు నివేశిత వేశ్మాంతాం నరోత్తమ సమావృతాం |1-5-19|
దుందుభులమ్రోతలతో, మృదంగధ్వనులతో, వీణానాదములతో,మద్దెలరవములతో ఆ మహానగరము అంతయుమాఱుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపఃఫలముగాలభించిన దివ్య భవనములవలె ఆ నగరమునందలి గృహములుబారులుదీఱి, విద్వాంసులతో నిండియుండెను. [18 – 19]

యే చ బాణైః న విధ్యంతి వివిక్తం అపరా పరం |
శబ్ద వేధ్యం చ వితతం లఘు హస్తా విశారదాః |1-5-20|
సింహ వ్యాఘ్ర వరాహాణాం మత్తానాం నదతాం వనే |
హంతారో నిశితైః శస్త్రైః బలాత్ బాహు బలైర్ అపి |1-5-21|
తాదృశానాం సహస్రైః తాం అభి పూర్ణాం మహారథైః |
పురీం ఆవసయమాస రాజా దశరథః తదా |1-5-22|
ఆ నగరమునందలి యోధులు, శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేఱినవారు,సమర్థులు, శబ్దభేది విద్యానిపుణులు. కాని వారుసహాయపడువారులేక ఒంటరిగానున్నవారినిగాని,పాఱిపోవుచున్నవారినిగాని చంపెడువారు గారు. వనమునందుమత్తిల్లి గర్వముతో గర్జించెడి సింహములను, గాండ్రించుపెద్దపులులను, ఝర్ఘరించు అడవిపందులను ఆ యోధులుధీరులై వాడియైన శస్త్రములతో, బాహుబలముతోసంహరించుచుండెడివారు. అట్టి వేలకొలది మహారథులతోనిండియున్న ఆ అయోధ్యానగరమును దశర్థమహారాజుపరిపాలించుచుండెను. [20 – 22]

తాం అగ్నిమద్భిః గుణవద్భిః ఆవృతాం
ద్విజోత్తమైః వేద షడఙ్గ పారగైః |
సహస్రదైః సత్య రతైః మహాత్మభిః
మహర్షి కల్పైః ఋషిభిః చ కేవలైః |1-5-23|
అచటి ద్విజోత్తములు అందఱును నిత్యాగ్నిహోత్రులు,శమదమాది గుణసంపన్నులు, వేదవేదాంగములయందుపారంగతులు, సత్యమును పల్కుటయందు నిరతులు, మిక్కిలిప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతోసమానులు. అంతేగాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టిఅయోధ్యానగరమును రాజధానిగా జేసికొని, దశరథమహారాజుకోసలదేశమును పరిపాలించుచుండెను. [23]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండేపంచమస్సర్గః |1-5|
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైనశ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఐదవసర్గముసమాప్తము 

Advertisements