గుడిమల్లం శివలింగ విశిష్టత

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత కలదు.ఈ ఆలములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భగ్రుహములో ప్రతిషించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలే ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతి తో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో అతి సుందరముగా ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్థంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

గుడిమల్లం ఆలయం ప్రస్తుతం వురావస్థు శాఖ వారి ఆధీనంలో వున్నది. పూజా పునస్కారాలు ఏవి జరగడము లేదు. కనుక ప్రజలు ఎక్కువగా రారు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపెడుతుంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడ అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి …. ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. ఆక్కడ దీన్ని చూడ వచ్చు.

ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

 

Click Here From Renigunta to గుడిమల్లం MAP

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s