కాల జ్ఞానం – 3

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు..

గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..

ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.

కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .

వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.

దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలు, నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది.

కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

కాలజ్ఞాన రచన

వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు.

అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.

తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు.

అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.

పంచభూతాల కలయికతోనే ”నేను” అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.

ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా ‘నువ్వు ఈ దిశలో వెళ్ళు’ అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ”బుద్ధీ కర్మానుసారిణీ” అని పెద్దలు చెప్తారు.

భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది” – అని తల్లి౮కి వివరించాదు

వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s