కాల జ్ఞానం – 2

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి! సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి

1. కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

2. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..

3. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.

4. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.

5. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే . వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

6. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.

7. హైదరాబాద్ లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు…. పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు – అది కూడా కేవలం ముస్లిం, హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.

8. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశా, భవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.

9. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s