కాలజ్ఞానం – 10

తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి,తిరిగి ధనహీనులై దరిద్రులై పోతారు…

తూర్పు దేశం అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు.మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ విజేతగా ఆవిర్భవించింది.తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది జపాన్.అణుబాంబు వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా,కొన్నిలక్షల మంది కాన్సర్ వంటి భయంకర వ్యాధులతోక్రమంగా మరణిస్తారు.

ఇత్తడి బంగారమవుతుంది. బంగాళా దేశము గొప్పదే అయినా, అక్కడ నదులు ఉప్పొంగి, ప్రజలందరూ ఆ జలములోపడి నశించిపోయేరు…

ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు. బంగ్లాదేశ్ , పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగానదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ వుంటారు.

ఇరవై అయిదుగురు అక్కాచెల్లెళ్ళు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు… మళయాళమున, పశ్చిమమున, మహారాష్ట్రమున, కర్నాటకమున నాలుగు దేశములలో నా స్వరూపమును తెలుసుకుకొన్నవారు మోక్షాన్ని పొందుతారు. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు.. జాతి, భేద, వర్ణాశ్రమ బేధాలు లేకనే ప్రవర్తిస్తారు…

ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే !క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు తగ్గుతోంది.అలాగే ఇతర విషయాలలో కూడా జాతి,కుల బేధాలు కనుమరుగవుతున్నాయి.

బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం – శిష్యుల సంవాదం::

హైదరాబాద్ లో కొద్దికాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తీ అభిమాన శిష్యుడిగా మారాడు.ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది.బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీదా ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు.

హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారు, ఆయన శిష్య బృందం.ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు.అది జీర్ణదశలో పురుగులతో నిండి,అతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది.అందరూ ఆ దుర్గంధాన్నిభరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వేపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక, మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు.అయితే, సిద్ధయ్య ఒక్కడూ మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేక, గురువునే అనుసరిస్తూ వచ్చాడు.

అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ నిలబడి, శిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడాయన తన శిష్యులతో – “మీరందరూ పెద్ద కులంవారమనీ సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా వున్నాయనీ అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురు భక్తి వుంటే, ఈ శుకనాన్ని తినండి.. అప్పుడే నేను మిమ్ముల్నినా నిజమైనా శిష్యులుగా గుర్తిస్తాను”అన్నారు.

ఆ మాట వినటంతోటే శిశ్యులందరూ నిర్ఘాంతపోయారు.

‘దూరంగా నిలబడే, కుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలం ‘ అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యను, శునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్రస్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు.

అప్పుడు స్వామి వారు శిష్యులవైపు తిరిగి “ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానము, గౌరవమో ఉన్నాయో తెలిసిందా?! నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అహర్నిశలూ నా మాటమీద విశ్వాసము, గౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినా, దాన్ని నేరవేర్చే దృఢ సంకర్పం కలిగిఉంటాడు. అందుకే సిద్దయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను.వారే నా ప్రేమకు పాత్రులవుతారు ” అని చెప్పారు.

వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపం చెందారు.

”గురువుగారూ, మా తప్పులను క్షమించండి.మేం మీకు శిష్యులుగా వున్నప్పటికీ కులం,అహంకారం,గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్దయ్యపట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ భోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది ” అంటూ వినయంగా చెప్పారు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s