గ్రహణ సమయములొ ఉపవాసములు ఉండడం ఎందుకు?

ఓ మాదిరి సంప్రదాయం ఉంది .మడి ,ఆచారాలు పాటించే ఇళ్ళలో ఇప్పటికి గ్రహణసమయములో ఉపవాసము ,తీనే పదార్దాలు ఫై దర్భలు వేయడం చూస్తూనాము .ఈతరం వాళ్ళకు అది వింతగాను మూర్ఖంగాను కనిపించవచ్చు .ఆలాగే గ్రహణానికి కొన్ని గంటలముందు నుంచే ఉపవాసం ఉండడం విడ్డురంగా ఉంటుంది .2-3-1980 నాటి ప్రముఖ దిన పత్రికలలొ విక్రం సారాభాయ్ పరిశోధన కేంద్రం వారి వ్యాసం కనువిప్పు కలిగిస్తుంది .గ్రహణ సమయంలో సూర్యకాంతి పడిన నీరు కలుషితం అవుతుందని దీనిని నివారించటంలొ దర్భలు శ్రేష్టంమైన ఓషధ గుణాలు కలిగిఉన్నయని వీరి పరిశోధన .దీని ప్రకారం తినే పదార్ధాలఫై వేసిన ధర్బలు తులసి దళముల కంటే ఎక్కువుగా చేడును కలిగించే కిరణములను నిరోదిస్తుంది అని చేప్పావచ్చు .అదే విధంగా గ్రహణసమయంలొ సుర్యకిరములులోని మార్పులు అనూహ్యoగా ఉండడంతో జీర్ణవ్యవస్థ తో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది .అందుకనే జంతువులు కూడా ఆ సమయంలో ఆహారంలో ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల వారి పరిశోధనలో బయటపడింది .

ప్రకృతిపరంగా ఏర్పడిన ఈ మార్పుకు అనుగుణంగా సమస్త జంతువులు ప్రవర్తిస్తుoటాయి .తేలివైన మానవుడు ప్రకృతికి బిన్నoగా ప్రవర్తిస్తునాడు .ఆ సమయములో ఏర్పడే కిరణాలు ప్రభావం వల్ల శరీరంలోని మార్పులుకు అనుగుణంగా ఆ సమయంలో భోజనాలు చేయకుండ ఉంటే మంచిది అని పెద్దలు చేపుతుంటారు .ఆ క్షణంలో మార్పు కనిపించదు కానీ దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది

Advertisements