నిత్య మానవ ధర్మాలు

నిత్య మానవ ధర్మాలు

1. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి

2. సూర్యోదయ సమయంలో నిద్రించేవారు అభినిర్ముక్తమనే పాతకాన్ని మూటగట్టుకుంటారు. అలాగే సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు అంశుమాన్ అనే పాతకాన్ని పొందుతారు. నైట్ డ్యూటీలు చేసేవారు కూడా సూర్యోదయ సమయంలో మాత్రం మెళకువగా ఉండాలి.

3. సూర్యునికి ఎదురుగా నిలబడి పళ్లుతోముకోరాదు. మధ్యవేలితోనే దంతధావన చేయాలి.

4. మలమూత్ర విసర్జనలు సూర్యచంద్రులకు ఎదురుగా చేయరాదు. ఇవి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. గాలి వచ్చే దిశకు ఎదురుగా చేయాలి. అది ఆరోగ్యానికి దోహదపడుతుంది.

5. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి… ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం…

6. ఇక స్నానాల్లోకెల్లా… చన్నీటి స్నానం ఉత్తమమైనది.
ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం. మిగతా స్నానాలకు పేర్లులేవు. అయితే… హైదరాబాద్ నగర వాసులు అదృష్టవంతులు… నదివరకు వెళ్లి ప్రవాహ ఉదక స్నానం చేయకున్నా… రోజూ కృష్ణా, మంజీరా నదుల నీటితో స్నానం చేస్తుంటారు. అది ఉత్తమోత్తమం. ఇక హైదరాబాద్ లోని మరో భాగం ప్రజలు గండిపేట జలాశయం నీటితో స్నానం చేస్తుంటారు. ఇదీ మంచిదే. వేయిపనులున్నా… వాటిని వదిలి… సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

7. నదీస్నానం, కాలవల్లో స్నానం చేసేప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానం చేయాలి. మగవారు ఎదురుగా కాకుండా, వాలుగా స్నానం చేస్తే వారి మగతనం నషిస్తుంది. అదేవిధంగా ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే… వారి స్త్ర్రీత్వం నశిస్తుంది. (ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే… నేడు సంతానలేమికి కారణమవుతున్నాయి)

8. ఒక నదిలో స్నానం చేసేప్పుడు మరో నదిని దూషించకూడదు.

9. చన్నీటి స్నానాన్ని శిరస్సును తడుపుకొంటూ ప్రారంభించాలి. చన్నీటితో శిరస్సులో ఉండే జ్నాన కణాలు ఉత్తేజితమవుతాయి.

10. వేడినీటి స్నానం పాదాలతో ప్రారంభించాలి. వేడినీటితో తొలుత పాదాలను కడిగితే నరాలకు బలం చేకూరుతుంది.

11. స్నానంచేసేప్పుడు… సబ్సుగానీ, నులుగుతోగానీ రద్దుకునేప్పుడు దేహానికి పైనుంచి కిందకు రుద్దితే కామేచ్ఛ పెరుగుతుంది. అదే దేహానికి అడ్డంగా రుద్దుకుంటే… కామేచ్ఛ తగ్గిపోతుంది.

12. సముద్ర స్నానం చేసేప్పుడు.. అంతకంటే ముందు చన్నీటి స్నానం ఆచరించాలి. సముద్రస్నానం తర్వాత మళ్లీ చన్నీటి స్నానం చేయాలి.

13. సముద్రస్నానాన్ని 15 నిమిషాలకు మించి చేయకూడదు. అలా చేయడం వల్ల పుంసత్వం నశిస్తుంది. సముద్రం నీటిలో ఉండే క్షారాలు, సోడియం క్లోరైడ్ మగతనంపై ప్రభావం చూపుతాయి.

14. మంగళ, శుక్రవారాల్లో సముద్రస్నానం చేయకూడదు.

15. సముద్ర స్నానం వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘ మాసాల్లో, అర్ధోదయ, మహోదయ సమయాల్లో చేయడం ఉత్తమం.

16. సముద్ర స్నానం చేశాక… ఒడ్డుకు వచ్చాక బయట మట్టిని మూడు సార్లు సముద్రంలో వేయాలి. సముద్రుడిని ఆ గట్టు దాటి రావొద్దని కోరడమే ఆ ప్రక్రియకు నిదర్శనం.

17. నదులు, కాలువలు, చెరువుల్లో స్నానం చేసి, బయటకు వచ్చేప్పుడు లోపల మట్టిని మూడు సార్లు బయటకు వేయాలి. అలా చేస్తే వాటిల్లో నీరు శాశ్వతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు.

18. స్నానం చేసేప్పుడు మౌనంగా ఉండకుంటే… తేజస్సు నశిస్తుంది.

19. మగవారు వస్త్ర్రంతోనే స్నానం చేయాలి. నగ్నంగా స్నానం చేస్తే దేహం పిశాచగ్రస్తమవుతుంది. స్త్ర్రీలు దిగంబరంగా స్నానం చేయొచ్చు.

20. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే… సూర్యుడి శక్తి నీటిలో ఉంటుంది కాబట్టి… ఆరోగ్యకరం.

21. స్నానం తర్వాత ముందుగా ముకం, తర్వాత వక్షస్థలం, ఆ తర్వాత శిరస్సు… ఆపైన మిగతా శరీర భాగాలను తుడుచుకోవాలి. పొడి వస్త్ర్రంతోనే తుడుచుకోవాలి. తడిబట్టను వాడకూడదు.

22. స్త్ర్రీలు సాధారణంగా కంఠస్నానం చేసేప్పుడు జుట్టు చివర తప్పనిసరిగా ముడి వేసుకోవాలి. లేనట్లయితే దేహం పిశాచగ్రస్తమవుతుంది. తలంటు చేసేప్పుడు ఆ అవసరం లేదు. అయితే… స్నానం పూర్తయిన వెంటనే జుట్టుకు ముడి వేయాలి.

23. స్నానం చేసేందుకు కట్టుకుని, తడిపిన బట్టను కిందకు వదలాలి. ఈ బట్టను తానైనా ఉతికి ఆరవేయాలి. లేదా భార్య, పిల్లలు ఆరవేయాలి. ఇతరులకు దాన్ని ఉతకడానికి గానీ, ఆరవేయడానికి గానీ ఇవ్వకూడదు.

24. బట్టలు మార్చుకునేప్పుడు పొడిబట్టలు పైకి తీయాలి. కిందకు విడవకూడదు.

25. స్నానం ఎక్కువ సేపు చేయాలి. గోడపై నీళ్లు చల్లినట్లు మమ అనిపించుకోకూడదు.

26. స్నానాలు ప్రధానంగా మూడు రకాలు:
అ) అభ్యంగన స్నానం (తలంటు పోసుకోవడం)
ఆ) అవబృద స్నానం (దీక్ష చివర చేసేది)
ఇ) అఘమర్షణ స్నానం (తడి బట్టలతో దేహాన్ని రుద్దుకోవడం. ఈ తర్వా స్నానం వల్ల బుద్దిజ్నానాలు పెరుగుతాయి)

27. తలంటు స్నానాలు ఏయేరోజుల్లో ఏ ఫలితాన్నిస్తాయి?

  • ఆదివారం – తాపం
  • సోమవారం – కాంతి
  • మంగళవారం – మంచిదికాదు
  • బుధవారం – లక్ష్మీ
  • గురువారం – ధననాశం
  • శుక్రవారం – విపత్తు
  • శనివారం – భోగం

(ఇవి పురుషులకు మాత్రమే. స్త్ర్రీలు రోజూప తలంటు చేసుకోవచ్చు. పురుషులు ప్రత్యేక దీక్షల్లో ఉన్నప్పుడు, వ్రతాలు చేసేప్పుడు ఈ నిబంధన అడ్డురాదు)

28. శిరస్సు స్నానం చేసినప్పుడు మాత్రమే తడి విభూతి నుదుటన పెట్టుకోవాలి. కంఠ స్నానం చేసినప్పుడు పొడి విభూపతిని మాత్రమే పెట్టుకోవాలి.

29. విభూతిని ముందుగా బొటన వేలితో కుడి నుంచి ఎడమకు పెట్టుకోవాలి. మధ్యవేలితో సరిచేసుకోవాలి. తర్వాత మధ్యమూడు వేళ్లతో అడ్డంగా విభూతి పెట్టుకోవాలి.

30. విభూతిని మూడు గీతులగా పెట్టుకోవడం అంటే… సత్వ, రజ, తమో గుణాలకు అతీతుడు అని అర్థం.
నోట్: ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు… మనుధర్మశాస్త్ర్రాల సారాలు. కాబట్టి.. ఎందుకు, ఏమిటి?? అని ప్రశ్నించకుండా… హిందూమతాభిమానం ఉన్నవారు పాటించగలరు. ప్రతిరోజూ కొన్ని ధర్మాలను మీ ముందు పెడతాను. దయచేసి అన్యమతస్తులు మీరు ఇష్యూ చేయడానికి నా వాల్ ను, నా పోస్టులను వేదికగా చేసుకోకండి. ఇక మనుధర్మశాస్త్ర్రాలను వ్యతిరేకించేవారున్నారు. అయితే… అందరికీ ఆమోదయోగ్యమైన ధర్మసూత్రాలను మాత్రమే ఇక్కడ నేను పోస్టు చేస్తున్నాను.

Advertisements