అష్టాదశ శక్తిపీఠాలు(18 శక్తిపీఠాలు)

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
శ్లో.
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
వివరణ:

 1.  శాంకరి-ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును-శ్రీ లంఖ (ఈ ఆలయ ఆనవాలులు పోర్చగీసులదాడి కారణంగా కనిపించుటలేదు,17c)
 2.  కామాక్షి – కాంచీపురం, తమిళనాడు
 3. శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
 4. చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక .
 5. జోగులాంబ – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు .
 6. భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ .
 7. మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర .
 8. ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర .
 9. మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ .
 10. పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ .
 11. గిరిజ – ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా.
 12. మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ .
 13. కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో.
 14. మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో.
 15. వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
 16. మంగళ గౌరి – గయ, బీహారు.
 17. విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్..
 18. సరస్వతి – జమ్ము, కాష్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉన్నది.
Advertisements