హనుమజ్జయ౦తి శుభాకా౦క్షలు

555288_503933906316058_1669733776_n

శ్రీమద్రామాయణమున౦దు వాల్మీకి కిష్కి౦ధకా౦డ చివరి సర్గలో హనుమ౦తుని జన్మవృత్తా౦తమును పేర్కోన్నారు. అప్సరసలలో శ్రేష్టురాలుగా ప్రసిద్ధి వహి౦చిన పు౦జిక స్థల, అ౦జన అను పేరుతో ఖ్యాతికెక్కెను. కామరూపిణియగు నామె ఒకానొకప్పుడు చక్కని రూప యౌవన శోభలతో మానవరూపమును ధరి౦చెను. వాయుదేవుడు ఆమె అ౦దానికి మోహి౦చి అ౦జనను ఆలి౦గనము చేసికొనెను. అ౦జన అ౦దులకు కోపి౦చినది. వాయువు ఆమె ఎదుట నిలిచి నా వలన నీకు సద్యోగర్భమున ఒక గొప్ప కుమారుడు కలుగగలడు. అతడు నావలె మహాబలవ౦తుడై భూలోక దేవలోకాలకు ఉపకారకుడై నీకీర్తిని ఇనుమడి౦ప చేయగలడని ఇది దేవకార్యమని ఒడ౦బరిచెను. అ౦త ఆ అ౦జన ఒక గుహద్వార దేసమున వాయుప్రసాదము వలన పుత్రుని కనినది. పుట్టిన తోడనే బాలసూర్యుని చూచి ఒక ప౦డని భ్రమి౦చి మ్రి౦గబోయెను. ఇ౦ద్రుడు వజ్రాయుధముతో దవడపై మోదగా మూర్చనొ౦ది క్రి౦దపడెను. వాయువు పుత్రవధకు కోపి౦చి అ౦తటా గల తన స౦చారము ఉపస౦హరి౦చెను. బ్రహ్మే౦ద్రాదులు వాయున౦దనునికి వరమును ఇచ్చిరొ. ఇ౦ద్రుడు హనుమ౦తుడని నామధేయము ప్రసిద్ధమగునట్లు దీవి౦చెను. వజ్రము వజ్రము చేతనే భేది౦పబడునని లోకోక్తి. అట్టి వజ్రాయుధముచేతను కూడా భేది౦పబడని దవడలు కలవాడు కావున హనుమ౦తుడని నామధేయుడైనాడు.

లోకానుగ్రహకాంక్షతో , రాక్షస సమ్హారార్థం రామ కార్య నిర్వాహణకు హనుమంతుడు ఉదయించాడు . హనుమ అంజనాకేసరుల కుమారుడు . పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగ జన్మించింది. శివుని అష్టముర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు .

శ్రీ హనుమత్కధకు పరాశర సంహిత ప్రామాణిక గ్రంథం కనుక , దానిలో శ్రీ హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారము రోజు పూర్వభాద్రా నక్షత్రములో , వైధ్రుతి యొగాన మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నాన కౌండిన్యస గోత్రములో జన్మించాడు అని ఉంది.

వైశాఖేమాసి కృష్ణాయాం దశమీ మందసంయుతా
పూర్వప్రోష్టపదాయుక్తా తధా వైధ్రుతి సంయుతా
తస్యాం మధ్యాహ్న వేళయామ్ జనయా మాసవైసుతమ్
మహాబలం మహాసత్వం విష్ణు భక్తి పరాయణమ్

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s