TIRUMALA INFO

మీరు తిరుపతి వెళ్లేముందు / వెళ్ళినతరువాత :
ఇప్పడికి చాలామందికి తెలియనది తిరుమలలో రూం బుక్ చేస్కోవడం .
*నాకు తెలిసి తిరుమల దేవస్థానం వారు ప్రతి జిల్లా లోను (e-darshan) సెంటర్ ను ఏర్పాటు చేసారు . మీరు తిరుమల వెళ్ళే ముందుగ ఇక్కడ కు వెళ్లి మీరు ఏ రోజుకు తిరుమల వేల్లదలుచుకున్నారో ఆ రోజు రూమ్స్ / దర్శనం టికెట్స్ ఇన్ఫర్మేషన్ అడగండి . రూమ్స్ కలిగా ఉన్నాయా లేదా వాళ్ళు మీకు చెబుతారు .
*90 రోజులు ముందు నుంచి రూమ్స్ బుక్ చేస్కోవచ్చు .
*ఈ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవడానికి ఒక్కరే వెళ్ళండి .. రూమ్స్ / టికెట్స్ ఉన్నాయ్ అనుకుంటే తరువాత అందర్నీ తీస్కుని వెళ్ళవచ్చు .

*రూమ్స్ / దర్శనం టికెట్ బుక్ చేస్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీస్కుని వెళ్ళండి .
*రూమ్స్ / దర్శనం టికెట్ ధర ఎంత అంటారా అది మీ పరిదిలోనే ఉంటుంది . తక్కువలో ఐతే 50/- కి కూడా రూం ఉంటుంది .
*దూరం నుంచి వచ్చేవాలు ఐతే ట్రైన్ టికెట్స్ కూడా ఒకసారి చూడండి .. అందరు చెప్పేదే ఎక్కువ లగేజి తీస్కుని వెళ్ళకండి .. అలాగని అసలు తీస్కుని వెళ్ళడం మానకండి .
*పెద్దలు ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు మందులు మరిచిపోకండి .

*సరే తిరుమల చేరుకున్నాం . ఇప్పుడు మీరు C.R.O దగ్గరకు వెళ్తే మీకు రూం ని కేటాయిస్తారు . ( C.R.O అని అడిగితే అక్కడ చెబుతారు )
*తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఎవరిని పడితే వార్ని అడగకండి . పోలీస్ వాళ్లనో లేదా అక్కడ పనిచేసే వల్లనో అడగండి . తిరుమలలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడకు వెళ్లిఅడిగితె వారు మీకు కావాల్సిన సమాచారం తెలియచేస్తారు .

*మరో ముఖ్యమైన విషయం మీతో పాటు చిన్నపిల్లలు / పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో కూడా మీకు రూం ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడు ఏ రూం లో ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఒక వేల దారి తప్పిన వాళ్ళకు తెలుస్తుంది .
*చాల సార్లు దర్శన టైం లో తప్పిపోవడం జరుగుతుంది . లేదా వారు వేరే లైన్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు కంగారు పడకండి . దర్శనం అయ్యాక అందరు ఒకేచోటుకు వస్తారు( గుడి బయట ) . అక్కడ వెయిట్ చేయమని ముందే చెప్పండి .
*గుడి బయటకు వచ్చాక కూడా ఎవరు కనబడకపోతే / రూం అడ్రస్ తెలియకపొతే మాత్రం ఎక్కువ దూరం వెళ్ళకుండా గుడికి దగ్గరలోనే ఉండమని చెప్పండి.
*గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది . ఆ ప్రక్కన సమాచార కేంద్రం ( చిన్న రూం లా ఉంది ) అక్కడే ఇలా తప్పిపోయిన వాళ్ళ సమాచారం తెలియచేస్తారు . ఎప్పుడైనా తెలియనప్పుడు కంగారు పడకుండా పోలీస్ వార్కి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు .

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s