దేవీభాగవత కథలు – 5

పూర్వం త్వష్టృ ప్రజాపతి దేవతలందరిలోకీ గొప్పవాడూ, గొప్ప తపస్సుచేసినవాడూనూ. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ, మూడు తలలతోనూ మూడు వేరువేరు  పనులు చేస్తూంటే మును లందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేదపఠనం చేసేవాడు. మరొక నోటితో సోమ పానం చేసేవాడు. మూడో ముఖంతో ప్రపం చంలో జరుగుతున్నదంతా గమనించేవాడు.

అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటికాలి మీదా; చలికాలం నీటిలోనూ, వేసవిలో అగ్నులమధ్యా నిలబడి, నిరాహారుడై తపస్సు చెయ్యటం చూసి, అతను తన పదవి కాజెయ్యటానికి చూస్తున్నాడనుకుని, అతని తపస్సు భగ్నంచేయ నిశ్చయించి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. అయితే వాళ్ళ శృంగార చేష్టలు వృత్రుడిమీద ఏమాత్రం పనిచేయలేదు. వాళ్ళు ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి, వృత్రుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు.

ఇంద్రుడు మహాత్ముడైన ఆ విశ్వరూపుణ్ణి చంపటానికి నిశ్చయించాడు. అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు. అతను ఐరావతాన్నెక్కి, విశ్వరూపుడు తపస్స మాధిలో ఉన్న చోటికి వెళ్ళి, ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు. తన పుత్రుణ్ణి  ఇంద్రుడు హత్య చేశాడని విని త్వష్టృ ప్రజాపతి మండిపడి, అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వ్రేల్చేసరికి, అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు పుట్టుకొచ్చాడు. అతన్ని చూసి త్వష్ట, ‘‘నీ పేరు వృత్రుడు. వేదతత్వం తెలిసిన వాడూ, మూడుతలలు గలవాడూ అయిన మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి  హతమార్చటానికి నువ్వు పుట్టావు. ఆ పని చెయ్యి,’’ అని వృత్రుడితో అని, రకరకాల ఆ…యుధాలు త…యారుచేసి ఇచ్చి, రథం కూడా ఇచ్చి, మంచి ముహూర్తాన, బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపటానికి పంపాడు.

దేవేంద్రుణ్ణి హతమార్చటానికి వృత్రుడు వస్తున్నాడని విని, మునులూ,యక్షు…లూ, దేవతలూ కంగారుగా పారిపోయారు. అలా  ఇళ్లూ, వాకిళ్లూ విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి, ‘‘రుద్రులనూ, ఆదిత్యులనూ, వసువులనూ, దిక్పాలకులనూ విమానాలమీద …యుద్ధానికి రమ్మని పిలవండి,’’ అన్నాడు.

ఇలా అని, ఇంద్రుడు బృహస్పతిని కూడా తన ఏనుగుమీద ఎక్కించుకుని, …యుద్ధానికి తరలాడు. అతని వెనక ఆ…యుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు. వృత్రుడు కూడా దానవ సేనలను వెంటబెట్టుకుని వచ్చాడు. ఉభ…యపక్షాలూ మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి.

నూరు సంవత్సరాలపాటు …యుద్ధం సాగింది. దాని మూలంగా లోకాలన్నీ బాధపడ్డాయి. ముందు వరుణుడు పారిపోయాడు. తరవాత క్రమంగా వా…యుగణాలూ, యముడూ, కాంతి నశించిన అగ్నీ నిష్క్రమించారు. ఇంద్రుడు పలాయనం చె…య్యక తప్పలేదు; దేవతలనందరినీ జయించి, వృత్రుడు తండ్రి వద్దకు వెళ్ళి, నమస్కారం చేసి, ‘‘అందరూ ఓడి, భయపడి పారిపోయారు. భయపడ్డ వాళ్ళు అని ఎవరినీ చంపలేదు. ఇంద్రుడు  కాలి సత్తువ కొద్తీ పరిగెత్తిపోతే, అతని ఏనుగును తెచ్చాను. దీన్ని నువ్వు కానుకగా తీసుకో. ఇంకా ఏం చెయ్యాలో చెప్పు, ఎంత కష్టమైనా చేస్తాను,’’ అన్నాడు.

వృత్రుడు తండ్రివద్ద సెలవు పుచ్చుకుని, క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదికి వెళ్ళి, గంగలో స్నానాలు చేస్తూ, దర్భచాప మీద ఉండి, అన్నిరకాల ఆహారమూ త్యజించి, యోగం అవలంబించి, మునులకు అద్భుత మనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. వృత్రుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి, ప్రత్యక్షమై, ‘‘ఇంక నీ తపస్సు చాలించి, నీకు ఏం కావాలో అడుగు,’’అన్నాడు.

వృత్రుడు బ్రహ్మకు చేతులు జోడించి, ‘‘దేవా, ఇదివరకే ఇంద్రపదవి సంపాదించి ఎంతో సంతోషించాను. ఇవాళ నీ దర్శనభాగ్యం లభించటం అంతకంటె ఎంతో ఎక్కువకదా! ధన్యుణ్ణి! నేను కోరిన వరం ఇయ్యదలిస్తే, లోహాలవల్లగాని, కరల్రవల్ల గాని, ఎండిన, ఎండని వెదురు వస్తువులతోగాని, ఇతర ఆయుధాలచేతగాని నాకు చావులేకుండా వరం ఇయ్యి. యుద్ధం సాగినకొద్దీ నా శక్తి పెరిగేటట్టు వరం ఇయ్యి,’’ అన్నాడు.

బ్రహ్మ అతను కోరినవరం ఇచ్చి వెళ్ళి పోయాడు. వృత్రుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగివెళ్ళి, జరిగినదంతా  ఆయనకు చెప్పాడు. ‘‘నా…యనా, నీకు శుభం! నీ అన్న విశ్వరూపుణ్ణి, అకారణంగా చంపి, బ్రహ్మ హత్యా పాతకం మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి  ఇప్పుడు నిర్భయంగా చంపెయ్యి,’’ అన్నాడు త్వష్ట.  ఇంద్రుణ్ణి నిర్మూలించమని త్వష్ట చెప్పిన మీదట వృత్రుడు రథం ఎక్కి, గొప్ప సేనను వెంటబెట్టుకుని, …యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడు మరొకసారి వృత్రుడితో …యుద్ధం చె…య్యటానికి సిద్ధపడ్డాడు.

ఇంద్రుడికీ, వృత్రుడికీ గొప్ప …యుద్ధం జరిగింది. …యుద్ధం చాలా దీర్ఘకాలం సాగిన మీదట ఇంద్రుడు పూర్తిగా ఓడి, దిక్కులేని వాడయ్యాడు. వృత్రుడు అమరావతికి వచ్చి, అక్కడి సకల సంపదలనూ స్వాధీనం చేసుకున్నాడు.
తన కొడుకు స్వర్గానికి రాజు కావటం చూసి త్వష్ట ఎంతో సంతోషించాడు. దేవతలు యజ్ఞభాగాలు పోగొట్టుకుని, చెట్టులూ, పుట్టలూ పట్టి పోయారు. దేవనగరం రాక్షస నగరమయింది. దేవతలు శివుడికి తమ గోడు చెప్పుకున్నారు. ‘‘తమ శరణుజొచ్చాం, మమ్మల్ని కాపాడాలి,’’ అన్నారు వాళ్ళు.

శివుడు మామూలు ధోరణిలో దేవతలతో, ‘‘మనం బ్రహ్మను వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు పోదాం.

అతనే వృత్రుణ్ణి చంపుతాడు,’’ అన్నాడు.  అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువు వారికి దర్శనం ఇచ్చి, ‘‘మీరంతా ఇలా వచ్చారు, ఏమిటి విశేషం?’’ అని అడిగాడు.

దేవతలు తమ కష్టం చెప్పుకున్నారు. వారితో విష్ణ్ణువు ఇలా అన్నాడు:‘‘అవును, మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. వృత్రుడికీ, ఇంద్రుడికీ స్నేహం కలిగించండి. నేను వజ్రా…యుధంలో అదృశ్యంగా ఉండి మీకు సహా…యపడతాను. సమస్త కోరికలూ తీర్చగల జగజ్జననిని ప్రార్థించి నట్టయితే, ఆమె తన యోగమాయతో సహాయపడుతుంది. ఆమె మాయకు లోబడి  వృత్రుడు ఇంద్రుడి చేతిలో చస్తాడు. మీరు కూడా ఆమె సహా…యంతో వృత్రుణ్ణి చంపండి.’’

దేవతలు కల్పవృక్షాలతో కూడిన మేరు పర్వతం మీదికి వెళ్ళి, మహాదేవిని ధ్యానించారు. వాళ్ళు మహాదేవి తమకు లోగడ సహా…యపడి, మహిషాసురుణ్ణీ, శుంభ నిశుంభులనూ, ఇతర రాక్షసులనూ ఎలా చంపినదీ చెప్పి, ‘‘తల్లీ, ఈ వృత్రుడు నీకు కూడా శత్రువే అయి ఉండాలి. లేకపోతే, నీ భక్తులమైన మమ్మల్ని ఇలా ఎందుకు హింసలపాలు చేస్తాడు?’’ అన్నారు. వారి పొగడ్తలకు సంతోషించి దేవి వివిధ ఆభరణాలతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దివ్యమైన ఆ…యుధాలతో రక్తచందనం రంగుగల వస్ర్తాలు ధరించి, వారి ఎదట ప్రత్యక్షమయింది.

ఆమె వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చి  అంతర్థ్ధానమయింది. దేవతలు కూడా తృప్తిపడి తిరిగివచ్చి, ఇంద్రుడితో స్నేహానికి  ఒప్పించటానికి మునులను వృత్రుడివద్దకు పంపారు.

మునులు వృత్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ‘‘వృత్రా! నువ్వు మహాయోగ్యుడవే. ఇంద్రుడు కూడా గొప్పవాడు అనిపించుకున్న వాడే. అలాంటప్పుడు మీరిద్దరూ స్నేహంగా ఉంటే వేరే చెప్పాలా? ఇంద్రుడు నీతో స్నేహ ప్రమాణం చేస్తాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి. మునులు మీకు మధ్యవర్తులుగా ఉంటారు.’’

దానికి వృత్రుడు, ‘‘మీరంటే నాకు గౌరవమే. మీమాట తీసివేయలేను. అయితే, పాపాత్ముడూ,బ్రహ్మహంతకుడూ  అయిన ఇంద్రుణ్ణి ఎలా నమ్మగలను,’’ అన్నాడు.

దానికి మునులు, ‘‘ఎవడి ద్రోహం వాణ్ణే  కట్టికుడుపుతుంది. ఘోరమైన బ్రహ్మహత్యా పాతకానికీ, కల్లు తాగిన పాపానికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. కాని మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదే! అందుచేత నువ్వూ, ఇంద్రుడూ  ప్రమాణ పూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు,’’ అన్నారు.
‘‘తడిదానితోగాని,పొడిదానితోగాని, రాతితో గాని, కరత్రోగాని, కఠినమైన వజ్రంతోగాని, పగలుగాని, రాత్రిగాని దేవతలూ, వారి అధిపతి అయిన ఇంద్రుడూ నన్ను చంపకూడదు. ఇందుకు అభ్యంతరం లేకపోతే, మీరు కోరినట్టు  ఇంద్రుడితో స్నేహం చేయగలను,’’ అన్నాడు వృత్రుడు. మునులు ఈ మాట తీసుకుపోయి ఇంద్రుడితో చెబితే అతను సరేనన్నాడు. ఇంద్రుడు వృత్రుడి నియమానికి అగ్నిసాక్షిగా ఒప్పుకున్నానన్నమీదట, ఆ మాట నమ్మి వృత్రుడు ఇంద్రుడితో స్నేహం చేశాడు.
.

ఇద్దరూ స్నేహంగా కలిసి తిరిగారు. సముద్రతీరానా, నందనవనంలోనూ సంచరించారు. వృత్రుడు తృప్తిపడ్డాడు. కాని ఇంద్రుడు మాత్రం వృత్రుణ్ణి చంపడానికి సరైన అవకాశం కోసం  ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఒకనాటి సంధ్యవేళ ఇంద్రుడూ, వృత్రుడూ సముద్రతీరాన తిరుగుతున్నారు. అది రాత్రీ కాదు, పగలూ కాదు; అంతేగాక వృత్రుడు  ఒంటరిగా ఉన్నాడు. అందుచేత   ఇంద్రుడు వృత్రుణ్ణి చంపటానికి  అదే అదను అనుకుని, విష్ణువును తలచుకున్నాడు. విష్ణువు వచ్చి, అదృశ్యంగా వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇంద్రుడికి

సముద్రపు నురుగు కనిపించింది; అది తడిదీకాదు, పొడిదీకాదు; ఏవిధమైన ఆ…యుధమూ కాదు. ఇంద్రుడు దేవిని కూడా తలచుకున్నాడు.ఆమె తన అంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయు ధాన్ని నురుగుతో కప్పి, వృత్రుడిమీద బలంగా విసిరాడు. ఆ దెబ్బతో వృత్రుడు కొండ విరిగిపడినట్టు పడి, అప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు.

శత్రుభయం తీరిపోయిన ఇంద్రుడు ఆనందంగా అమరావతికి  తిరిగివచ్చి, మునుల నుంచి స్తోత్రాలు పొందుతూ, మహాదేవికి ఉత్సవం చేయించి, నందనోద్యానంలో రత్న మయమైన  ఆలయాన్ని దేవికి కట్టించి, ప్రతిష్ఠించాడు.

Advertisements