దేవీభాగవత కథలు – 2

బ్రహ్మ ప్రార్థన ప్రకారం, ెూగనిద్ర విడిచి వెళ్ళగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డంవచ్చి, ‘‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి ల…ు కారకు లనీ, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడనీ విన్నాం. అలాటి విష్ణువును ెూగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తీ, తేజస్సూ ఏమ…్యూయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం. నువ్వు శక్తి మాత్రమేఅన్ని శక్తులకూ మూలకారణం అంటున్నావు. నిజం ఏదో మాకు తెలి…ుటం లేదు,”అన్నారు.
దానికి సూతుడిలా అన్నాడు:
‘‘మునులారా, మీరడిగినదానికి సమా ధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైన వారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక, విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవ మనీ, మరికొందరు సూర్యుడనీ, మరికొందరు అగ్ని అనీ,ఇంకా కొందరు చంద్రుడనీ, ఇంద్రు డనీ, కొందరు ఏదో అనీ, మా…ులోపడి, రకరకాలుగా అభిప్రా…ుపడతారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా, అన్ని ప్రమాణాలకూ అతీతమైన పరశక్తిమాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వా…ుు వులో, అగ్నిలో కనబడుతూంటుంది. ”
అలా శక్తిచేత మేల్కొల్పబడిన విష్ణువు బ్రహ్మనుచూసి, ‘‘అబ్బాయీ, నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి?” అని అడిగాడు. ‘‘ఇంక నేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవులనుంచి ఇద్దరు రాక్షసులు, మధుకైట భులనేవాళ్ళు పుట్టి, నన్ను చంపుతామంటూ …ుుద్ధానికి పిలిచారు,” అన్నాడు బ్రహ్మ.
‘‘దీనికే భ…ుపడతావా? నేను ఎంతలేసి రాక్షసులను చంపానుకాను?”అని విష్ణువు అంటున్నంతలోనే, ఆ రాక్షసులు వచ్చిపడి, బ్రహ్మతో, ‘‘పారిపోయివచ్చి,ఇక్కడ దాక్కు న్నావా? మేం కనుక్కోలేమనే? నిన్ను ఇతను రక్షస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక, ఇతన్ని తోడు చావమంటావా?” అని మీదికి వచ్చారు.
విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని, రాక్షసు లతో, ‘‘తెగ వదరుతున్నారు, మదమెక్కింది కాబోలు? తొందరపడకండి, ఇప్పుడే మీ మద మణుస్తాను,”అంటూ …ుుద్ధానికి సిద్ధ పడ్డాడు. దేవి ఆకాశంనుంచి చూస్తూండగా విష్ణువూ, మధుడూ …ుుద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలిసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల…ుుద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడు తూంటే విష్ణువుకుక్రమంగా నీరసం వచ్చేసింది. అతనికి ఏం చె…్యూలో తోచలేదు. రాక్షసు లను ఎలా జయించాలి? దానికి ఉపా…ుం ఏమిటి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అను కుంటుంటే రాక్షసులు అతనితో, ‘‘…ుుద్ధం చె…్యుటానికి శ…క్తి చాలకపోతే, మాకు దాసు ణ్ణని దణ్ణంపెట్టు, లేకపోతే నిన్ను చంపి, తరవాత బ్రహ్మను చంపేస్తాం,”అన్నారు.
విష్ణువు సౌమ్యంగా వారితో, ‘‘అలసిపోయిన వారినీ, వెనక్కుతిరిగినవారినీ, భ…ుపడిన వారినీ,…ుుద్ధంలో పడిపోయినవారినీ ఎదుర్కో వటం వీరధర్మంకాదు. అది అలా వుంచి, మీరు ఇద్దరున్నారు. నేనేమో ఒక్కణ్ణే! ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని …ుుద్ధంచేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకుమాత్రం …ుుద్ధ ధర్మం తెలి…ుదా?” అన్నాడు.
‘‘సరే, విశ్రమించు. ఈలోగా మేమూ విశ్రమిస్తాం,” అన్నారు రాక్షసులు. అప్పుడు విష్ణువు దివ్యదృష్టితో, ఆ రాక్షసులు వరం పొందినవారని గ్రహించి, ‘‘ఈ దుర్మా ర్గులతో అనవసరంగా …ుుద్ధం చేస్తినే! వీరు పరాశక్తినుంచి స్వేచ్ఛామరణం వరంగా సంపా దించారు. వీరిని ఎలా చంపటం?” అని ఆందోళన పడసాగాడు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు:
‘‘తల్లీ, నీ సహా…ుం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీదుమిక్కిలి వాళ్ళే నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్ళు చచ్చే ఉపా…ుం కూడా నువ్వే చెప్పు.” దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, ‘‘రాక్షసులమీద నా మా…ు కప్పుతాను.
వారిని జయించు,” అన్నది. రాక్షసులు విష్ణువుతో, ‘‘ ఓడిపోతానని ఎందుకు భ…ుపడతావు? శూరులకు జ…ూప జ…ూలు రెండూ సంప్రాప్తమవుతాయి. నీచేత ఎందరు రాక్షసులు ఓడారుకారు? అయినా ఎప్పుడూ జ…ుమే కలుగుతుందా?” అని ఎత్తి పొడిచారు. ఈ మాటకు విష్ణువు మండిపడి, రాక్షసు లతో తలపడి, వాళ్ళను పిడికిలితో పొడిచాడు. వాళ్ళు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టి…ుుద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి, రక్తం ఓడుతూ ఉన్న సమ…ుంలో ఆకాశంలో దేవిని చూశాడు.
అదే సమ…ుంలో దేవి రాక్షసులపైన మన్మ థుడి బాణాలలాటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు …ుుద్ధ్దంమాట మరచి మోహ పాశానికి చిక్కుపడ్డారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, ‘‘ఎంతమంది రాక్షసులనైనా చూశానుగానీ, …ుుద్ధవిద్యలో మీతో సమాను లను చూడలేదు. మీ …ుుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలాసంతోషమయింది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను,” అన్నాడు.
దేవీ ప్రభావంచేత మా…ూమోహితులై ఉన్న రాక్షసులు, విష్ణువు మాటకు అభిమానం తెచ్చు కుని, విష్ణువును తూస్కారంగా చూస్తూ, ‘‘మేం నిన్ను అడిగేవాళ్ళమూ, నువ్వు మాకు ఇచ్చేవాడివీనా? కావాలంటే నువ్వే కోరు, మేం ఇస్తాం!” అన్నారు. ‘‘నేను కోరినది ఇస్తారా?అదే నిజమైన వీరుల గుణం. చాలా సంతోషం! నా …ుుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నాచేత ఇప్పుడే చచ్చిపొండి,మరి ఇచ్చినమాట నిలు పుకోండి!”అన్నాడు విష్ణువు.
రాక్షసులు కళవళపడి, కొంచెం ఆలో చించి, ‘‘నువ్వు మాటమీద నిలబడే వాడివైతే, మాకు వరం ఇస్తానన్నమాట గుర్తుంచు కుని,నీరులేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు. అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చి పోతాం,” అన్నారు. విష్ణువు నవ్వి, తన తొడలు పెంచి,‘‘రాక్షసు లారా, రండి,” అన్నాడు. రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలనూ, రాక్షసులు తమ శరీరాలనూ ఇలా పెంచగా, చిట్టచవరకు రాక్షసుల శరీరాలకన్న విష్ణువు తొడలే పెద్దవి అ…్యూయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ళ మెదడు, నీటిలోపడి, పెద్దమిట్ట త…ూరయింది.
అది మొదలు భూమికి ‘మేదిని’ అనే పేరువచ్చింది. వ్యాసుడి తపస్సు ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు, ‘‘ప్రసంగవశాన ఇతర విష…ూలు చాలా విన్నాం. కాని కొడుకుకోసం తపస్సుచే…ు బోయిన వ్యాసుడి కథ అలాగే ఉండి పోయింది,” అన్నారు. మునులతో సూతుడు, వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు:
నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరిమీద, కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆ…ున శక్తిని మన స్సులో నిలిపి తపస్సు చేస్తూంటే, భూమ్యా కాశాలు కంపించాయి. ఇంద్రుడు భ…ుపడి, దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి, ‘‘వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. గొప్ప ప్రమాదం వచ్చిపడింది. మమ్మల్ని కాపాడు!” అని ప్రార్థించాడు.
‘‘తపస్సుచేసుకునేవారికి కీడు తలపెట్ట రాదు. వాళ్ళు ఇతరులకు చెరుపు చె…్యురు. వ్యాసుడు కొడుకును కోరి, శక్తితోకూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు,” అని శివుడు దేవతలతో చెప్పి, వ్యాసుడి ముందు ప్రత్యక్షమై, అతని కోరిక తీరేలాగు వరమిచ్చాడు. వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను అరణి మధించి అగ్నిచేసి, ‘‘ఇలాటి అగ్నివంటి కొడుకును నాకు ప్రసాదించగల స్ర్తీ ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతి బంధకం,” అని అనుకుంటుండగా, ఆకా శంలో ఘృతాచి కనబడింది. సమీపంలోనే మన్మథుడుకూడా కనిపించాడు.
వ్యాసుడు మన్మథుడి ప్రభావానికి గురి అయికూడా,‘‘ఇది నన్ను మోసగించ టానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో? లేక, పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా?”అనుకున్నాడు.
పురూరవుడి లాగే తానూ బాధపడవలసి వస్తుం దేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచికూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని, ఆడ చిలుకగామారి ఎగిరి పోయింది. అయితే వ్యాసుడు అగ్నికోసం మధిం చుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు.
వ్యాసుడు శుకుణ్ణి చూసి,‘‘ఏమిటీ అద్భుతం! ఇది శివుడి మహిమ కావాలి,” అనుకున్నాడు. ఆ…ున తన కొడుకును గంగకు తీసుకుపోయి, స్నానంచేయించి, జాతకర్మచేశాడు. ఆకాశంలో దేవదుందు భులు మోగాయి. భూమిమీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైనవారు పాడారు. రంభ మొదలైన అప్సరసలు ఆడారు.
చిలుకరూపం ధరించిన స్ర్తీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కు శుకుడు అనే పేరువచ్చింది. కురవ్రాడు క్రమంగా పెద్దవాడ …్యూడు. శుకుడికోసం ఆకాశం నుంచి జింక చర్మమూ, దండమూ, కమండలమూ పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపన…ునంచేసి, బృహస్పతివద్ద వేదాభ్యాసం చేయించాడు.
శుకుడు తన విద్యాభ్యాసం ముగి…ుగానే గురుదక్షణ ఇచ్చి, తండ్రివద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడుఎంతో సంతోషించి, అతనికివివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుకుడుఅందుకు అంగీకరించక, వైరాగ్యం పూని తత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు.
‘‘మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం. అంతేకాని మరేవీ ముక్తికి బంధాలుకావు. న్యా…ుంగా ధనం సంపాయిస్తూ, అబద్ధమాడక, శౌచం విడవక, అతిథులను ఆదరిస్తూ, విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ, గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వసిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు; నువ్వుకూడా ఒక కన్యను పెళ్ళాడి, నాకు సంతోషం కలిగించి పితృదేవలకు తృప్తినివ్వు,” అన్నాడు వ్యాసుడు.
ఇంతచెప్పినా శుకుడి బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు మళ్ళీ,‘‘నా…ునా ఒకప్పుడు నేను ముక్తినివ్వగల దేవీభాగవతం రచించాను. దాన్ని చదివి జ్ఞానివికమ్ము,” అని దానిని గురించి చెప్పడం ప్రారంభించాడు.
Advertisements