సూచనలు

 1. నిత్య-మానవ-ధర్మాలు
 2. దేవతలకు సమర్పించవలసిన నైవేద్యాలు:
 3. జన్మనక్షత్రం ప్రకారం దోషం ఉన్నదా? అలా ఎందుకు చేయాలి.
 4. ఏనామాలను వినడం వల్ల స0సారికుల పాపాలు నశించిపోతాయో
 5. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు.
 6. ఆదిత్య హృదయం పరమ పవిత్రం
 7. వర్షాలు కురవడానికి ఈ క్రింది స్తోత్రములు నిత్యము పారాయణ చేయగోరెదము
 8. నవగ్రహప్రదక్షిణలు 
 9. సుబ్రహ్మణ్య వ్రతకల్పన.. సంతాన ప్రదాతకం
 10. గడ్డి తినే ఆవును అడ్డగించిన వాడు యమలోకానికి పోతాడు.
 11. అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.
 12. ఈ పద్యాలను మననం చేసుకుంటూ ఉంటే సర్పభాయాలు ఉండవని పెద్దలు చెప్పిన మాట.

 1. పితృ దోషం ఎటుల ఏర్పడుతుంది 
 2. పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు
 3. పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగపిల్లలు పుట్టరు
 4. పితృ-దేవతలను-విస్మరించడం
 5. పితృ దోషం అంటే  ఒక శాపం
 6. మహాలయ-పక్షం(వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి)
 7. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?
 8. తద్దినాలు పెడుతున్నాం కదా… మహాలయ పక్షాలు పెట్టాలా?
 9. వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించవని భావించడం?
 10. పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ? 
 11. మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా ! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి
 12. భగీరథుడు తన పితృదేవతలకోసం తపస్సు చేశాడు?(గంగావతరణం)
 13. ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా  
 14. సంతానం కలగక పోయినా మనిషి పితృ ఋణం విముక్తి పొందగలడా?
 15. అబ్దికంలో కూడని పదార్థాలు ఏమిటి? భస్మ, తిలక ధారణలతో ఆబ్దికం పెట్టవచ్చా?
 16. తెలియకుండా  చేసిన పాపాలకి శిక్ష?

  1. సూర్య నమస్కారం చేస్తే రోగాలు, దారిద్ర్యం మాయం…..
  2. ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు
  3. మనసును భ్రమింపజేసే బాహ్య శత్రువులు
  4. కుటుంబ భందవ్యాలు మోక్షానికి ప్రధానమైన ద్వారాలు 
  5. ఏదో చేసుకోవడం కర్మ కాదు. విధింపబడ్డ విహిత కర్మనే ఆచరించాలి. నిషేధకర్మను ఆచరించరాదు.
  6. దుఃఖం-తొలిగే-త్రోవ
  7. మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు
  8. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. 
  9. జీవితం మీద విరక్తి కలగకూడదు(హనుమంతునికి ఆత్మహత్య)

 1. స్తుతించడం
 2. ఐదు అక్షయ నిధులు(ఈ ఐదు నిధులనూ ఏ చోరులూ దోచుకోజాలరు)
 3. రుణ విముక్తులము ఈ విధంగా అవుదాం
 4. దిష్టి మంత్రం
 5. అంగారక చతుర్థి
 6. సూర్యారాధన వలనే సంపద కలుగుతుంది…
 7. సోమవతి అమావాస్య రోజున
 8. ఆలయ దర్శనం
 9. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతున్ని ప్రార్ధించండి
 10. క్రోధమును జయించు పద్ధతి
 11. ఏలినాటి శని ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోవాలంటే
 12. శనికి శనీశ్వర నామం ఎలా వచ్చింది……..
 13. చీమలకు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుంది…….
 14. సంపంగిపూలతో పూజ ఎంతో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది
 15. అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు చేయు విధానములు, నియమములు
 16. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
 17. శనిభగవానుడిని పక్కకు నిలబడి నమస్కరించడి
 18. బుధగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజించండి
 19. చంద్ర గ్రహ దోష నివారణలు………..
 20. కుజ దోషం పరిహారాలు
 21. నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి
 22.  శని రాజునైనా బిక్షకునిగా మారుస్తుంది
 23. ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?.
 24. నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?
 25. లక్ష్మీ దేవి మంత్రం
  ప్రతి రోజు మీరు ఈ మంత్రము జపించినచో అమ్మవారి ఆశిస్సులు మీకు ఎప్పుడు వుంటాయి.ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్స్మై నమః
 26. రాహుగ్రహ దోషానికి రాహుకాల దీపాలు…….,,,
 27. భోజనం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
  కుక్క, కోడి చూస్తుండగా భోజనం చేయకూడదని, వాటికి కాసింత పెట్టి తర్వాత తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మంచి పద్దతి. మిక్కిలి వేగంగా గానీ, చాలాసేపుగానీ తినకూడదు. చల్లారిన అన్నాన్ని మళ్లీ వెచ్చ పెట్టి తినకూడదు.నెయ్యి మొదలైన ఒకటి, రెండు పదార్థాలను వెచ్చ పెట్టవచ్చునుగాని, మిగిలిన వాటిని అలా చేయకూడదు. అలాంటి ఆహారం విషంతో సమానం. మిక్కిలి వేడి అన్నం బలాన్ని పోగొడుతోంది. అలాగే బాగా చల్లబడిన ఆహారం జీర్ణం కాదు.అలాగే ఆహారంలో గోధుమ, యవలు, కరక్కాయ, ఉసిరిక, ద్రాక్షలు, పెసలు, పంచదార, నేయి, పాలు, తేనె, దానిమ్మ-వీటిని ప్రతిరోజూ తినాలి. అయితే ఉసిరికను మాత్రం పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, సప్తమి, ఆదివారం, రేవతి నక్షత్రం రోజున, సూర్య సంక్రమణంనాడు, రాత్రి పూట తీసుకోకూడదు.ఇక పిండితో చేసిన పదార్థాలు, వేపుడు బియ్యం, అటుకులు మొదలైనవి భోజనం తర్వాత తినకూడదని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. ముందు కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలను, నేతితో కూడుకున్న వాటిని, తర్వాత తేలికగ్గా జీర్ణం అయ్యేవాటిని, చివరిగా మజ్జిగా తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
 28. వ్యాపారంలో సంకటాలు వస్తున్నై, ఎంత ప్రయత్నం చేసిన, ఆ సంకటాలనుంచి బయటపడలేక పోతున్నాం, అని అంటే ఈ విధం గా చేయండి.
  ” సంకట నాశెక గణేశ స్తోత్రం ” తప్పనిసరిగా కనీసం 3 సార్లు, మీ వ్యాపార సంస్థలో కూర్చుని చదవండి. ఒక బెల్లపు ముక్కను, గణేసునికి నైవేద్యం పెట్టండి. హాతి వెలిగించి మీ వ్యాపారసంతలో అలా అలా చూపించండి.    తప్పక సమస్యలన్నీ తొలగు ను ..sankata1sankata2
 29. ఇంటిలోని ఎత్తుపల్లములు.. వాటి ఫలితములు…!
  1. ఇంటి యొక్క ఆవరణయందుగాని ఇంటియందుగాని ఇంటిలోని గదులు యందుగాని తూర్పువైపు కంటే పడమరవైపు ఎత్తుగాను ఉత్తరముకంటె దక్షిణము ఎత్తుగా ఉండవలెను. అంటే నైఋతికంటే ఆగ్నేయము పల్లముగాను ఆగ్నేయం కంటె వాయువ్యము పల్లమగాను వాయువ్యము కంటె ఈశాన్యం పల్లముగాను ఉండవలెను. అట్లుండిన శుభప్రదము.
  2. ఇంటికి ఆవరణయందు పడమరకంటె తూర్పు ఎక్కువ ఖాళీస్థలమును దక్షిణము కంటె ఉత్తరమున ఎక్కువ ఖాళీస్థలముండవలెను. అట్లుండిన శుభప్రదము.
  3. ఇంటియందలి గదులు ఉత్తరముకంటె దక్షిణమందు తూర్పుకంటె పడమర యందును పెద్దవిగా నుండిన శుభప్రదం.
 30. ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది .
  1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు,  బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు  కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్టైతే మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.
  2. పిలక ఉన్న కొబ్బరికాయపై చుట్టూ  7 సార్లు, 7 దారాలు,   చుట్టి, మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. పైనుంచి కిందకి    clock wise-   గా తిప్పుకోవాలి. ఒక మంచి రోజు , అలాచేస్తే మీ అదృష్ట సమయములలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి .
  3. లక్ష్మి దేవికి  7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు,  ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి (  కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు  అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ  ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి  మంచి ని  తప్పక లక్ష్మి దేవి  చేకూర్చుతుంది.
  4. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని సుభ్రపరచండి.
  5.   ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.(గోమతి చక్రం- పూజా సామగ్రి దొరికే దుకాణం లో దొరుకును ).
  6. గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .
  7. సాయంత్రం , ఉదయం లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .
  8. మూత లేకుండా “డస్ట్ బిన్” ఉండకూడదు, పగిలిన అద్దము ఉండకూడదు ఇంటిలో.
 31. మనకు మన పురాణ కథలు గాని, పూజరులుగాని, పంతుళ్ళు గాని, మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. అవును. వాళ్ళు చెప్పేది నిజమే. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. విభిన్న రూపాలు కలిగిన మన గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం.
  * సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
  * చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
  * కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
  * బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
  * గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
  * శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
  * శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
  * రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
  * కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
  * ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
  * పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.
  * పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
  * మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
  * స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.
 32. గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణలు. వీటివల్ల ఉత్పన్నమయ్యే దైవికశక్తి మనిషిని కాపాడుతుంటుంది. నిర్దిష్టమైన పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుంది.చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను తాకి నమస్కారాలు అర్పిస్తుంటారు. వీలైనంతవరకూ వాటిని తాకకుండానే ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.నవగ్రహాల మధ్య తేజస్వి ఐన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు కూడా తూర్పుముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముకంగా ఉంటాడు.శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన ప్రతిష్ట.సూర్యునిచూస్తూ లోనికి ప్రవేశించి ఎడమ వైపునుండి (చంద్రునివైపు నుండి) కుడి ప్రక్కకు తొమ్మిది ప్రదక్షణలు చెయ్యడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడి వైపు నుండి ఎడమవైపునకు (అనగా బుధుడి వైపు నుండి) రాహువునూ కేతువునూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి.గ్రహదోషాల నుండి తప్పుకోవడానికి నవగ్రహప్రదక్షిణ కంటే ఉత్తమమయిన మార్గం లేదన్నది స్పష్టం
 33. గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలో తెలుసా?!
  దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే గాకుండా పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారమ్ వంటి వాటికి కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దిష్టి, దృష్టి అనబడే రెండింటిలో దిష్టి అనబడేది అతిభయంకరమైనది.సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయముతో గానీ షాపులను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది.ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను ఇంటిముందు లేదా షాపుల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతిశనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం షాపు లేదా దుకణాం మొత్తం పసుపునీళ్ళు చళ్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్రశనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
  1. వేడి నీటిలో స్నానం చేయరాదు.
  2. వేడి నీటితో స్నానం చేయువారు కాళ్ళ దగ్గర నుండి ప్రారంభించాలి.
  3. చన్నీటితో స్నానం చేయువారు శిరస్సు నుండి ప్రారంభించాలి.
  4. పురుషుడు నిత్యం తల స్నానం చేయాలి.
  5. స్త్రీలు నైమిత్తిక స్నానం చేయాలి.
  6. స్నానం అంటే మజ్జనం,నదిలో గానీ, తటాకములో గానీ, సముద్రంలో కానీ చేయాలి. స్నానం అంటే బక్కెట లో నీరు ముంచి చేయడం కాదు. దేశకాల పరిస్ధితుల నను సరించి స్నానం చేయాలి. నదీ స్నానం చేయు స్త్రీలు నదికి అభిముఖముగా నిలబడాలి. నదీ స్నానం చేయు పురుషులు నదీ క్రమము నను సరించి చేయాలి.
 34. ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?
  1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
  2. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
  3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
  4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
  5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
  6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
  7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
  8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
  9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
  10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.
 35. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?
  తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
 36. ధ్వజస్తంభం లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో ఎందుకు కాపురం ఉండకూడదు?
  అది పరమాత్మ ఆవహించిన ప్రదేశం. ఆ ప్రదేశం దేవుని స్వంతం. అలా నీడ పడటం ద్వారా, సూర్యరశ్మి పడాల్సినంత పడదు. తర్వాత ఎన్నో అనారోగ్యాలు. అందుకే నీడ పడకూడదని శాస్రం చెబుతోంది. తాను ఉన్నటువంటి ప్రదేశంలో అనారోగ్యం స్వామికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు కదా.
 37. మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అంటారు. ఎందుకు?
  భూపుత్రుడు కుజుడు. మంగళవారానికి అధిపతి కూడా కుజుడే . తల్లిని తొలుస్తుంటే ఏ బిడ్డ అయిన ఎందుకు ఉరుకుంటాడు. ఇంకా కుజకారకం అగ్నితత్వం కూడా.
  భూమిని తవ్వేది నీటి కొరకే కదా. మంగళవారం భూమిని తవ్వటం వాళ్ళ అగ్నితత్వం కలిగి భూమిలో నీరు పడకపోవడం జరుగుతుంది. అందుకే నీటికి సంబందించిన ఏ పనిని మంగళవారం ప్రారంభించరు.
Advertisements