శివ నామ మహిమ

శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.

ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.

శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.

శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం.

ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. న భూమికి సంబంధించిన భాగాలను, మ నీటికి సంబంధించిన భాగాలను, శి అగ్నికి సంబంధించిన భాగాలను, వ గాలికి సంబంధించిన భాగాలను, య ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.

శివుని పేర్లు…!

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం…

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s