మానవుడే మహనీయుడు

రైలు ప్రయాణం చెయ్యటానికి జాతి, కులమత బేధాలు అడ్డురావు, టికెట్ ఉంటే చాలుకదా ! అలాగే భగవంతుణ్ణి దర్శించాలన్న, చేరువకవాలన్న, ఇవేవి అడ్డురావు భక్తీ ఒక్కటుంటే చాలును. భగవంతుడు మనల్ని తన మనిషిగా చేసుకోవాలంటే, మనకుండవలసిన గుణాలని కొన్నిటిని గీతలో వివరించి యున్నాడు. కోరినకోరికలు తీర్చే దేవుడు అంటే అందరికి ఇష్టమే కదా. దేవుడు గొప్పవాడు అని మనం అనుకుంటే సరిపోదు కదా ! దేవుడు కూడా మనల్ని గొప్పవాడిగా గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే కొన్ని గుణాలు మనకుండాలి, అవి ఏమిటో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాము.

1) ఎవరియందు ద్వేషం లేకుండా ఉండాలి.

2) అందరితో స్నేహపూర్వకంగా, ప్రేమ అభిమానం కలిగి ఉండాలి.

3) అహంకారం లేకుండా, ఓర్పు, సహనం కలిగి ఉండాలి.

4) సుఖాలయందు–దుఃఖాలయందు ఒకేరకమైన భావం కలిగి యుండాలి.

5) దైవమార్గంలో నడుచుటకు నిరంతర కృషి చేస్తూ ఉండాలి.

6) మీరు లోకం చూసి భయపడకూడదు….. అలాగే లోకం మిమ్మల్ని చూసి భయపడకుండా ఉండగలిగేటట్లు ప్రవర్తించాలి.

7) పరుల ధనాన్ని ఆశించకూడదు.
 ధృడమైన నిర్ణయం కలిగి యుండాలి.

9) ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో యెంత మాట్లాడాలో తెలుసుకుని, అలా మాట్లాడే నియమం కలిగి యుండాలి.

10) తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషంగా ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి యుండాలి.

మొదలైన గుణాలు కలిగి ఉన్నవాళ్లు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అనిఅన్నాడు భగవంతుడు. ఇటువంటి గుణాలు మనలో ఉన్నాయా, లేవా అని ఆలోచించుకుని, కొద్దిగా కలిగి యుంటే, మిగిలిన వాటికోసం ప్రయత్నం చేద్దాము. మంచి కార్యాలు వెంటనే చెయ్యాలని అన్నారు పెద్దలు. భగవంతుడు ఏదో గాలి మాటలుగా మాత్రం ఇవి చెప్పలేదు. చెప్పటం సులువే కానీ ఆచరించటం కొంచెం కష్టమే.

మనల్ని పుట్టించిన పరమాత్మకి మన బుద్ధి గురించి తెలుసు కదా! అటువంటి అనుమానాలు మనకి వస్తాయనే, మొదట తాను ఆచరించి, తారవాత మనల్ని ఆ మార్గంలో నడవమని తెలియచేసాడు. ఎక్కడో కాదు, ఈ కర్మ భూమిలోనే అవతరించి, మన మధ్యే ఉండి, తన దైవత్వాన్ని ప్రదర్శించకుండా, మనందరికీ వాటిని అలవరచాలని, మానవునిగానే పుట్టి, రామావతరములో తానూ ఆచరించి చూపించి, మన చేత దేవుడు అనిపించుకున్నాడు.

గీత ఒక theory ఐతే, రామాయణం ఒక practicle….. గీతలో చెప్పిన మార్గాలని—–రామావతారం లో ఆచరించి చూపాడు. అందువల్ల మనమంతా రామాయణ పారాయణ చేద్దాం. వీటినన్నింటిని సులభంగా ఆచరించటానికి తగిన సహాయం లభిస్తుంది. ఆలస్యం చేయకండి. రేపనేది మనది కాదు.

శ్రీ రామ జయ రామ.. జయ జయ రామా…… జై శ్రీ రామ్…..

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s