భగవద్గీత:— తృతీయో‌உధ్యాయః

అర్జున ఉవాచ |
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||

భావం:–అర్జునుడు పలికెను—ఓ జనార్ధనా ! కేశవా ! నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ?

2 వ శ్లోకం:–

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో‌உహమాప్నుయామ్ ||

భావం:–కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా
తెల్పుము.

3 వ శ్లోకం:–

శ్రీభగవానువాచ |
లోకే‌உస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
ఙ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||

భావం:–శ్రీ భగవానుడు పలికెను— ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.

4 వ శ్లోకం:–

న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషో‌உశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||

భావం:–మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగానిష్టాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు.

5 వ శ్లోకం:–

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||

భావం:–ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును.

6 నుండి 10 శ్లోకాలు….

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే!ll

భావం:–ఎవడు, కర్మేంద్రియాణి – కర్మేంద్రియములను, సంయమ్య – బిగబట్టి, మనసా – మనస్సుచేతను, ఇంద్రియార్థాన్ – శబ్దాది విషయములను, స్మరన్ – స్మరించుచు, ఆస్తే – ఉండునో, సః – వాడు, విమూఢాత్మా – వివేకములేనివాడు, మిథ్యాచారః – కపటియును అని, ఉచ్యతే – చెప్పబడుచున్నాడు.

7 వ శ్లోకం:–

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే‌உర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||

భావం:–కానీ అర్జునా ! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడు శ్రేష్టుడు.

8 వ శ్లోకం:–

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ||

భావం:–నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూడ సిద్ధింపదు.

9 వ శ్లోకం:–

యఙ్ఞార్థాత్కర్మణో‌உన్యత్ర లోకో‌உయం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ||

భావం:–ఓ అర్జునా ! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపు.

10 వ శ్లోకం:–

సహయఙ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వో‌உస్త్విష్టకామధుక్ ||

భావం:–కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చునది అగుగాక అని పలికెను.

11వ శ్లోకం:–

దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

భావం:–“ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిష్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు.” అని పలికెను.

12 వ శ్లోకం:–

ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యఙ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

భావం:–యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా దొంగయే.

13 వ శ్లోకం:–

యఙ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ||

భావం:–యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునే భుజింతురు.

14 & 15 శ్లోకాలు:–

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యఙ్ఞాద్భవతి పర్జన్యో యఙ్ఞః కర్మసముద్భవః ||

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యఙ్ఞే ప్రతిష్ఠితమ్ ||

భావం:–ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. విహితకర్మలు యజ్ఞములకు మూలము. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై యున్నాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s