నవగ్రహ ధ్యానశ్లోకం

సూర్యుడు .. చంద్రుడు .. కుజుడు .. బుధుడు .. గురుడు .. శుక్రుడు .. శని … రాహువు … కేతువు, వీటిని నవగ్రహాలని అంటారు. ఈ నవ గ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వాహనం వుంది. సూర్యుడు – ఏడు గుర్రాల రథం పై , చంద్రుడు – పది గుర్రాల రథం పై, కుజుడు – పొట్టేలుపై, బుధుడు – సర్పం పై, గురుడు – హంసపై, శుక్రుడు – కప్పపై, శని – గద్దపై, రాహువు – సింహం పై, కేతువు – డేగపై కనిపిస్తూ వుంటారు. ఆకాశంలో సంచరించే ఈ నవగ్రహాలు నేలపై నివసించే మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయనే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు చెప్పారు.

నవగ్రహాలు అత్యంత శక్తి వంతమైనవని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి నవగ్రహాలను శాంతింపజేయడం ద్వారానే వాటి అనుగ్రహాన్ని పొందవచ్చనే విషయాన్ని అవి స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయా గ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహ పూజలు … ప్రదక్షిణలు … హోమాలు చేస్తుంటారు. నవగ్రహాలను సంతృప్తి పరిచి శాంతింప జేయడం కోసం ఒక్కో గ్రహానికి ఒక్కో రోజున వాటికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం రోజున సూర్యుడికి నెయ్యితో కలిపిన గోధుమ పిండి .. సోమవారం రోజున చంద్రుడికి పెరుగు .. మంగళవారం రోజున కుజుడికి కందిపప్పు .. బుధవారం రోజున బుధుడికి పెసర పప్పు – నల్ల ఉలవలు .. గురువారం రోజున గురుడికి కొమ్ము శనగ పప్పు – మినప పప్పు .. శుక్రవారం రోజున శుక్రుడికి బొబ్బర్ల పప్పు .. శనివారం రోజున శనికి నువ్వులు .. రాహువుకి పూర్ణాలు .. కేతువుకి పచ్చి కూరగాయలతో కలిసిన భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలని శాస్త్రం చెబుతోంది.

గ్రహ దోషాల కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం వుంది కాబట్టి, నవగ్రహాలను శాంతింప జేస్తూ వాటి అనుగ్రహంతో సాఫీగా జీవితాన్ని కొనసాగించడమే శ్రేయస్కరమని చెప్పవచ్చు.

నవగ్రహ ధ్యానశ్లోకం

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

చంద్రః
దథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

రాహుః
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతుః
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||

నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||

గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s