దేవాలయానికి వెళ్ళేటప్పుడు చేయకూడని పనులు

మనం పుణ్యం కోసం, పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటాము. ఆలయ సందర్శనం ద్వారా పుణ్యం సంపాదించటం మాట అటుంచితే, పాపం పొందకుండా ఉంటే అంతే చాలును. ఇదేదో వింతగా ఉంది అని అనుకుంటున్నారా ! ఇది పరమసత్యమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆలయానికి వచ్చినవారు తమకి తెలియకుండానే కొన్ని దోషాలు చేస్తుంటారట…అవేవో మనం కూడా కొన్నిటిని తెలుసుకుందాము….

ఆలయ సమీపమువరకు వాహనము పై రాకూడదు……
చెప్పులు దూరంగా వదిలి, కాలినడకనే రావలెను

పెద్దలకి & భగవంతునికి ఒంటి చేతితో నమస్కరించకూడదు

అలాగే కొంతమంది ఆత్మ ప్రదక్షిణ అని చెప్పి, భగవంతుని ఎదుటే ప్రదక్షిణ చేస్తారు….కాని అలా చేయకూడదు…. ఆలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయవలెను….

చాలామంది దర్శనానంతరము భగవంతుని ఎదురుగా, కాళ్ళుచాపి కూర్చుంటారు… అట్లు కూర్చొనుట మహాపాపము….
భగవంతుని ఎదుట ఎత్తైన ఆసనములపై కూర్చొనుట మహాపాపము….

ఆలయములో నిద్రించకూడదు & భోజనం చేయకూడదు….
భగవంతుని ఎదుట మన కస్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు….

ఆలయంలో ఉన్న సమయంలో ఎవరిమీద కోపగించకూడదు……
ఎవరైనా మనల్ని సాయమడిగితే… నేనున్నానని చెప్పి..కాపాడేవారి వలే అభయమివ్వకూడదు…ఎందుకంటే అందరిని కాపాడేది ఆ భగవంతుడే కదా….
కోర్కెలు సిద్ధించుట కొరకు పూజలు చెయ్యకూడదు…..

ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో భగవంతునికి సమర్పించకుండా ఉండకూడదు……

భగవంతునికి వెనుదిరిగి కూర్చోనకూడదు
భగవంతుని ఎదుట ఇతరులకు నమస్కరించకూడదు & ఇతర దేవతలని నిందించకూడదు.

వీటిలో ఇంతవరకు మనం కొన్నింటినైన చేసి ఉంటాము…. కనుక ఇప్పటికైనా తెలుసుకున్నాము కాబట్టి ఇటువంటి దోషాలు చెయ్యకుండా భగవంతుని పరిపూర్ణంగా దర్శించుదాము… ఇకమీదనైన మనం జాగ్రత్తపడదామా !

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s