తులసి

తులసి అంటే మనం పూజచేసి దణ్ణం పెట్టుకోవటం, తీర్థంలో తులసి వేసి లోపలికి పుచ్చుకోవటమే తెలుసు కొందరికి. కానీ తులసి ఆరోగ్య ప్రదాయిని అని, తులసివల్ల చాలా లాభాలు ఉన్నాయని కానీ కొంతమందికి తెలియవు. మన పెద్దలు వీటివల్ల లాభాలు తెలుసుకుని మనకి చెప్పి ఉన్నారు, వాటిలో కొన్నిటిని నేను మీకు అందిస్తున్నాను.

మ్నపెరట్లో ఉన్న తులసి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే మరికొంచం శ్రద్ధగా నీళ్ళు పోసి పెంచుకుంటాము.

మనదేశంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. తులసిని గురించి తెలియనివారు ఉండరని నా అభిప్రాయం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇంటి ముందు వేప చెట్టు, ఇంటి వెనుక తులసి చెట్టు ఉంటే ఎటువంటి వ్యాధులు మనదరి చేరవు, అన్నట్టుగా దర్శనమిస్తూనే ఉంటాయి.

“మన దేవాలయాలలో పూజారి ఇచ్చే తీర్థంలో తులసిదళం ఉంటుంది. తీర్థం ఇస్తూ ఈ మంత్రం జపిస్తారు……

అకాల మృత్యు హరణం
సర్వ వ్యాధి నివారణం
సమస్త పాప క్షయ కరం
శ్రీదేవి పాదోదకం పావనం శుభం” ll…….అంటూ మూడు సార్లు తీర్థం ఇస్తారు.
అంటే….తులసి తీర్థం సర్వరోగ నివారిణి అని, ఇంటి దగ్గర తులసి తీర్థం తీసుకోకపోయినా….దేవాలయంలో తీర్థం తీసుకుంటే సకల రోగాలు నివారించబడతాయి అని అర్ధం…….

తులసి… రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది.

తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే—-గుండెల్లో ఉన్న (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి.

ఒక గుప్పెడు తులసి ఆకులను—రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి, ఆ రసాన్ని—తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు—ఆ
ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది.

ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వ్యాధినిరోధక శక్తి—పాము విషాన్ని కూడా హరిస్తుంది.

తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును.

తులసిరసం కంటికింద రాసుకుంటే—–నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి.

తులసిరసం, నిమ్మరసం కలిపి పైపూతగా పూస్తే—గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.

తులసిరాసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు పడుకునే ముందు తీసుకుంటే, బాగా నిద్రపడుతుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధము.

తులసిరసంని ప్రతీరోజు క్రమంతప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ని & రక్తపోటుని నిరోధిస్తుంది.

తులసి ఆకుల కషాయాన్ని పరగడుపునే త్రాగితే, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, వెన్నెముక నొప్పి, పొత్తికడుపు మంట వంటి వాటిని నివారించవచ్చును.

తులసిఆకులు ఎండపెట్టి, పోడిచేసుకుని, కొద్దిగా వేడినీటిలో కలిపి, పేస్టు లాగా చేసి ముఖానికి పట్టిస్తే, చర్మ సౌందర్యం పెరిగి శరీరము కాంతివంతంగా, సున్నితంగా తయారగును……

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s