టిట్టిభ పక్షుల

(టిట్టిభ పక్షుల యొక్క పట్టుదలను తప్పుగా అంచనా వేసిన సముద్రుడు వాటితో, వైరానికి దిగి, పరాభవం పాలయ్యినట్టు, శత్రువు యొక్క తెలివితేటలని సరిగ్గా తెలుసుకోనివాడు ఓడిపోతాడు.)

ఒకానొక కాలములో సముద్రం దగ్గర రెండు టిట్టిభ పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ రెండు పక్షులు ఎంతో సంతోషంగా ఉండేవి. ఆడపక్షి గుడ్లుపెట్టే సమయము వచ్చింది. ఆ పక్షి దంపతులు ఎక్కువ గుడ్లు పెట్టాలన్న విషయం మీద వాదులాడుకోసాగాయి. మగపక్షి ఆ సముద్రపు ఒడ్డునే ఇసకలో గుడ్లు పెట్టమని చెప్పింది. కానీ ఆడ పక్షి సముద్రపు అలలలో గుడ్లు కొట్టుకు పోతాయేమోనని భయపడసాగింది. కానీ మగపక్షి…..ఆడపక్షి మాట వినలేదు……సముద్రుని వల్లే కాదు ఎవరివల్లా ఏ భయము ఉండదని నొక్కి చెప్పింది. ఆ మాటలని విని సముద్రుడు నవ్వుకున్నాడు.

ఆడపక్షి సముద్రతీరాన్నే గూడుకట్టి గుడ్లు పెట్టింది. ఆ పక్షులు ఆహారము కోసం వెళ్ళినప్పుడు సముద్రుడు తన అలలతో ఆ గూటిని గుడ్లను నీటిలోకి లాక్కునిపోయాడు.

గూడు గుడ్లతో సహా మాయమయ్యినందుకు పక్షులు చాలా బాధపడ్డాయి. సముద్రుని మీద కోపించి నీటిని తొడివేసి ఆ సముద్రున్ని ఎండగట్టాలని నిశ్చయించుకొన్నారు. తమ ముక్కులతో నీటిని తోడి, దూరంగా పోయసాగాయి. అంతులేని మహాసాగరాన్ని తమ చిన్న– చిన్న ముక్కులతో ఎందకట్టటం సాధ్యమయ్యే పనేనా?అయినా ఆ పక్షులు అలా పట్టువదలకుండా అసాధ్యమయినా ఆ పనిని చేస్తూనే ఉన్నాయి

వాటి పట్టుదలను చూసి. పక్షులరాజైన గరుక్మంతుడు జాలిపడ్డాడు. సముద్రుని మీదకు యుద్దానికి వచ్చాడు . సముద్రుడు భయపడి వాటి గుడ్లను తిరిగి ఇచ్చాయి. ఆ పక్షులు సుఖంగా జీవించాయి.

నీతి:—పట్టువదలకుండా పనిచేసేవాడికి అన్ని సానుకూలమవుతాయి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s