గురుశిష్య సంబంధం

మంచిగురువు మనకు దొరకుట చాలా కష్టం, అది సాధ్యమయ్యే పని కాదు. గురువు మనల్ని, అతని శిష్యునిగా స్వీకరించాలి తప్ప , ఇతనే మన గురువు అని మనం నిర్ణయించాము అంటే, అతనికన్నా మనమే గొప్ప అన్నమాట, అదే జరిగినట్లయితే, అతను మన గురువు ఎలా అవుతారు ? మన అజ్ఞానం తప్ప.

మనకు తెలియకుండానే మనల్ని స్వీకరించి, మనకు కనపడకుండానే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ, అవసరమైన సమయంలో, తన వద్దకు చేరదీస్తాడు గురువు.

మననుంచి ఏమి ఆశించరు, మనమీద ఆధారపడరు, తన నమ్మకాలను, విశ్వాసాలను మనపై నిలబెట్టేవారే అసలైన గురువు. మన శ్రేయస్సు కోరి, మనల్ని తనంత గొప్పగా తీర్చి దిద్దేవారే నిజమైన గురువు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము.

ఒక అయస్కాంతం తన సాన్నిధ్యం చేత, మరో ఇనుప ముక్కను, అయస్కాంతంగా చేస్తుంది. అయస్కాంతం—ఇనుప ముక్కలోని, ఏ భాగాన్ని తొలగించదు. తనలోని ఏ భాగాన్ని, ఇనుప ముక్కలోకి చొప్పించుట లేదు. ఇనుపముక్కలోని నిఘూడంగా దాగిఉన్న అయస్కాంత ధర్మాన్ని, తన శక్తితో మేల్కొల్పుతున్నది. గురువు కూడా అలాగే తన శక్తి మనకు ధారపోసి, తన అంత శక్తిమంతుని వలె తీర్చిదిద్దుతున్నారు.

దైవం కొరకు అన్వేషణ మొదలుపెట్టిన శిష్యుని మనసులో, గురువు వాక్కు, మజ్జిగ చుక్కై తోడవుతుంది. ఆపైన క్రమంగా పాలు పెరుగైనట్లు, శిష్యుని మనసు నిశ్చలత్వాన్ని పొందుతుంది. ఆ పైన సత్కర్మాచరణ అనే చిలకటం ద్వారా, అనుభూతి అనే వెన్నగా పైకి తేలుతున్నది. ఇలా వెన్నలా రూపొందిన శిష్యుడు, వెన్న మజ్జిగలో తేలుతూ, మజ్జిగకు మంచి రుచి ఇచ్చినట్లు, తన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఉంటూ, ఆ ప్రపంచానికే దివ్యనుభూతిని ప్రసారం చేసే, కేంద్రంగా రూపొందుతాడు. అంటే తయారైన ఈ మజ్జిగ ఎన్ని పాలకుండలకైనా తోడుగా పనికి వస్తుంది. వెన్న ఎంత కలిపినా మజ్జిగలో కలవనట్లు, ఎలాంటి పరిస్తితులు ఎదురైనా, పూర్వపు స్థితి లోకి వెళ్ళుట జరగదు.

గురుశిష్య సంబంధాలు,ఆధ్యాత్మిక రంగంలో విలక్షణమైనవి. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు…….. అని చిత్తశుద్ధితో నమ్మినవాడే అసలైన శిష్యుడు అని పిలవబడతాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s