ఏకలవ్యుడు

మన పురాణాలలో చెప్పుకోదగిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అందులో ఏకలవ్యుడు ఒక మహానుభావుడు. ఈ రోజు ఏకాలవ్యుడుని గురించి తెలుసుకుందాము.

హిరణ్యధనువనే ఒక బోయరాజు ఉండేవాడు. అతనికి ఏకలవ్యుడనే ఒక కుమారుడున్నాడు. ఏకలవ్యుడు చాలా చురుకుదనం, పట్టుదల కలవాడు. అతడు విలువిద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆ కాలంలో ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ధనుర్విద్య నేర్పించేవాడు. అందుచేత ఏకలవ్యుడు ద్రోనచార్యులవారి దగ్గరకు వెళ్ళి, తనకు విలువిద్య నేర్పమని ప్రార్ధించాడు. కానీ ద్రోణాచార్యుడు అతన్ని తన శిష్యునిగా అంగీకరించలేదు.

ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వద్ద సెలవు తీసుకుని తానున్న అడవికి వెళ్ళిపోయాడు. గురువు దొరకలేదని అతడు నీరుగారిపోలేదు. అతడి పట్టుదల మరింత పెరిగింది. అడవిలోనే ఒక గుడిసె నిర్మించుకుని, ఏకలవ్యుడు స్వయంగా మట్టితో ద్రోనాచారుల విగ్రహాన్ని చేసుకుని, అతనినే గురువుగా స్వీకరించాడు. ప్రతీరోజూ భక్తితో ఆ విగ్రహాన్ని ప్రదక్షిణ నమస్కారములు చేసి, బాణాలు వేయడాన్ని నేర్చుకొనసాగాడు. తనంతట తానుగా, ఒంటరిగా, గంటల తరబడి సాధన చేయసాగాడు. రోజంతా ధనుర్విద్య గురించే ఆలోచించేవాడు, కలలుకనేవాడు. విలువిద్యను గురించిన ఆలోచనలతో అతని మనస్సంతా నిండిపోయింది. దానితో అతని మనస్సే అతనికి గురువై, ధనుర్విద్యలోని మెలకువలను, గొప్పగొప్ప రహస్యాలని తెలియచేసింది. క్రమంగా తన గొప్ప సంకల్పశక్తి వల్ల, గురువుమీద ఉన్న అఖండమైన భక్తి వల్ల, విలువిద్యలో ఏకలవ్యుడు గొప్ప ప్రావీణ్యతను సంపాదించాడు. దాని ఫలితంగా అతడు ధనుర్విద్యలో అందరినీ, చివరకు తన గురువును కూడా మించిపోయాడు.

ఏదైనా సరే నేర్చుకోవాలనే బలమైన కోరిక(ఆకాంక్ష)ఉన్నవానికి అతని మనస్సే గురువై అన్నీ నేర్పిస్తుందని మనకు ఏకలవ్యుని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s